"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

16 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
;జ
 
===జగమొండి===
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
===జగత్ కిలాడీలు===
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు,జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
===జనముద్దు బిడ్డ===
అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు.
===జప్ప జప్ప===
తొందరతొందరగా వేగంగా వెళ్ళే [[నడక]], [[పరుగు]], గబ గబ
===జనగణమన పాడేశారు===
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
===జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నాడు===
ప్రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
 
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు,జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
===జనముద్దు బిడ్డ===
అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు.
 
===జప్ప జప్ప===
తొందరతొందరగా వేగంగా వెళ్ళే [[నడక]], [[పరుగు]], గబ గబ
 
===జపించటం===
ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండటం
 
===జెర్రికో కాలు విరిగినట్టు===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు.
 
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని అచ్చోసిన ఆంబోతు అంటారు
 
===జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు===
అసాధ్యమైన పని,అసంభవమైన కార్యం.
 
===జవసాలివ్వటం===
ఎదురు తిరగటం . జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం
===జిడ్డుగాడు===
ఓ పట్టాన వదలనివాడు.ఎదుటి వ్యక్తులను ఏదో వంకతో పలకరించి, గంటల తరబడి ఆ మాటా ఈ మాటా చెబుతూ కాలక్షేపం చేసేవాడు.తీరిక లేదని చెప్తున్నాపట్టించుకోరు.ఇంకోపనేదీ చేసుకోనివ్వరు.వదిలి వెళ్ళరు.
 
===జిల్లేడు పెళ్ళి===
దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు విడిచి వెళ్ళినప్పుడు మూడో పెళ్ళిలో జిల్లేడు చెట్టుకు ముందుగా తాళి కట్టడం ఆచారం. మూడు సంఖ్య అంత మంచిది కాదని జిల్లేడును మూడో పెళ్ళి కూతురుగా భావించి తాళి కడితే ఆ తరువాత పెళ్ళి చేసుకునే స్త్రీ నాలుగో భార్యగా వరుస క్రమంలో నిలుస్తుందని దురభిప్రాయం . జిల్లేడుకు తాళి కట్టడం నామకార్థం. అంతా దొంగ వ్యవహారమే
===జిల్లేళ్ళు మొలవటం===
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో , ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
 
===జీగంజి===
[[గంగానది|గంగా]] జలం, [[తులసి]] తీర్థం . ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని ''జీగంజి'' అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది'
===జీడికట్టుదాకా===
ఎంతో ఎత్తుగా ఉంది అని . [[తాటిచెట్టు]] మొవ్వు మీదకు [[చీమ]]ల లాంటివి వెళ్ళి పాడు చేయకుండా ఆ తాటి చెట్టు మధ్య భాగంలో బాగా జగటగా ఉండే జీడికట్టును కడుతారు. దాంతో చీమలు పైకి పోలేవు.
 
===జుట్టూ జుట్టూ పట్టుకోవటం===
తీవ్రంగా విభేదించటం బాహా బాహీ, కొట్లాడుకోవటం, విమర్శించుకోవటం,
===జుర్రుకోవటం===
అతిగా పొందటం,సంపూర్ణంగా ఆనందంగా ఆస్వాదించటం పళ్ళ రసాలు, పాయసాలను నోటితో జుర్రుకుంటే అందాలను కళ్ళతోటే జుర్రుకొంటుంటారు
 
===జువ్వ జువ్వ===
జుయ్‌ జుయ్‌ మని తొందరగా భూమిలోకి ఇంకటం
 
===జెండా మోయటం===
కార్యభారాన్ని భరించటం ,ఆయా పక్షాల బాధ్యతలన్నింటినీ భుజాన వేసుకుని పనిచెయ్యటం
 
===జేబులు కొట్టడం===
దోచుకోవటం
===జొబ్బు జొబ్బు===
చాలామంది మనుషులు ఒక చోట కూడితే గుంపు అంటారు. పశువులు ఉంటే మంద అంటారు. విపరీతంగా కుప్పలు కుప్పలుగా ఎక్కడైనా ఈగలు ముసిరితే జొబ్బుజొబ్బుగా ఈగలున్నాయి అంటారు.
 
===జోడుగుర్రాల స్వారీ===
రెండు పనులు ఒకేసారి చెయ్యటం రెండుగుర్రాలపై చెరి ఒకదానిపై ఒక కాలు వుంచి పరుగు తీస్తే ఖచ్చింతంగా ప్రమాదమే..
 
 
; ఝ
2,14,105

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/721713" నుండి వెలికితీశారు