"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

===పరీక్షించు విధానం===
 
పరీక్షించవలసిన నూనె/కొవ్వు లోని మలినాలను తొలగించుటకై మొదట ఫిల్టరు పేపరులో నూనెను ఫిల్టరు చెయ్య వలెను.సుమారు 1.5-2.0 గ్రాం.ల నూనె/కొవ్వును కచ్చితంగా తూచి, B24 మూతి గల కొనికల్ ఫ్లాస్కు లేదా ఎర్లెన్‍మెయిర్ ఫ్లాస్కు లో తీసుకొన వలెను.దీనికి 25 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను పిప్పెట్ ద్వారా తీసి కలుప వలెను.ఇప్పుడు ఫ్లాస్కును హీటరు మీద వుంచి,ఫ్లాస్కుమూతికి రెఫ్లెక్షు కండెన్సరు అమర్చ వలెను.హీటరును ఆన్ చేసి ఒక గంటసేపుగంటమించకుండ /లేదా ఫ్లాస్కులోని నూనె ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ తో పూర్తిగా సపోనిపికేసను చెందు వరకు వేడి చెయ్య వలెను.సపొనిపికెసన్ పూర్తయినప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పారదర్శకంగా,జిడ్డులేకుండ కనిపించును.ఇప్పుడు హీటరును ఆపి వేసి,కండెన్సరు పై లోపలిఅంచునుండి 10 మి.లీ.ఆల్కహల్ తో రిన్స్ చెయ్యాలి.ఫ్లాస్కులోని ద్రవానికి కొన్ని చుక్కల పినాప్తలీన్ ఇండికెటరు ద్రావానాన్ని కలపాలి. ఇండికెటరు కలిపిన వెంటనే ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగులోకి మారును.బ్యూరెట్ లో 0.5 నార్మాలిటి వున్న పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రవంను నింపి ఫ్లాస్కులోని ద్రవాన్ని టైట్రెసన్ చెయ్యడం ప్రారంభించాలి.బ్యూరెట్ నుండి ఆసిడ్ ను చుక్క చుక్కలుగా వదులుతూ,ఫ్లాస్కును కదుపూతూ టైట్రెసన్ చెయ్యలి.ఫ్లాస్కును కదపటం వలన ఆసిడ్ ఫ్లాస్కులోని ద్రవం అంతట సమంగా కలిసి చర్య సమానంగా జరుగును.ఫిలా టైట్రెసన్ చెయ్యునప్పుడు ఫ్లాస్కులోని ద్రవం పింక్ రంగు పోగానే టైట్రెసన్ ఆపి వెయ్యాలి.బ్యూరెట్ లోని రిడింగ్ ను నమోదు చేయాలి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/723592" నుండి వెలికితీశారు