కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraocbot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 724208 ను రద్దు చేసారు
చి Robot:Fixing ఆంధ్రప్రదేశ్ -> ఆంధ్ర ప్రదేశ్ (మధ్యలో ఖాళీ)
పంక్తి 6:
పన్నేండటవ ఏట విజయవాడ కాంగ్రెస్ సదస్సుకు విచ్చేసిన మహాత్మగాంధీ ని సందర్శించారు. వారి బోధనలో ప్రభావితులై శాకాహరిగా ఉంటానని ప్రమాణం చేసారు. జీవితాంతం ఖద్ధరు ధరించారు. టంగుటూరి ప్రకాశం పంతులు సహచార్యం, బోధనలు వారిని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటీష్ వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు.
== రాజకీయ ప్రస్ధానం ==
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 195 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో చేరారు. పిమ్మట దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. ఆర్ధిక శాఖను వారు అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. 1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిర్వహించారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.
== ఎఐసీసీ సారథ్యం ==
1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించారు.అద్యక్ష పదవికి ఎన్నిక జరిగి అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షుల్లో ఆయన ఒకరు. ఓటమి పిమ్మట పతనావస్ధలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పని చేసారు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా మరో వర్గానికి కాసు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెస్ 1980లో ఇందిరాకాంగ్రెస్‌లో విలీనం చేశారు.
పంక్తి 21:
తరువాతి=[[పి.వి.నరసింహారావు]]
}}
{{ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]