విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామము. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామము. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు [[పట్టణము]] గా పిలిచే వారు. అందుచేత , పూర్వీకులకు , ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, [[సముద్రం]] ప్రక్కన గాని ఉన్నట్లు గా తెలిసేది. ఆంధ్రులకు ఈ [[పట్టణము]] అన్నమాట ఒక సంకేతమును ఇచ్చే పదము. . ఈ ప్రాంతమంతా . [[క్రీస్తు పూర్వం 260]] లో [[అశోక చక్రవర్తి]] పాలనలో [[కళింగ దేశం]] ఉండేది. ఆ కళింగ దేశంలో , అంతర్భాగంగా ఈ [[విశాఖపట్టణము]] ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, [[త్రికళింగదేశము]] అనే ([[త్రిలింగ దేశము]], [[తెలుగు దేశము]]) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: [[7 వ శతాబ్దం]] లో [[కళింగులు|కళింగులు]], [[8 వ శతాబ్దం]] లో వేంగి (ఆంధ్ర రాజులు) [[చాళుక్యులు]](ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో [[రాజమండ్రి రెడ్డి రాజులు]], [[పల్లవ రాజులు]], [[చోళులు]], తరువాత [[గంగ వంశం]] రాజులు [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్‌ షాహి]] లు, [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]], [[హైదరాబాదు సంస్థానం|హైదరాబాదు]] నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. [[15వ శతాబ్దం]] నాటికి , ఆంధ్రదేశానికి [[స్వర్ణయుగం]] తెచ్చిన [[విజయనగర సామ్రాజ్యం]] లో అంతర్బాగమైంది.
 
* [[ 260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]] లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]] లో ఒక భాగంగా ఉండేది.
* [[ 13]] ఎ.డి – [[సింహాచలం]] దేవస్థానం నిర్మాణం జరిగింది.
* [[ 208]] ఎ.డి – [[చంద్ర శ్రీ శాతకర్ణి]] విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
* [[1515]] ఎ.డి – [[ఆంధ్రభోజుడు]] [[శ్రీకృష్ణ దేవరాయలు]] విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, [[సింహాచలాన్ని]] పలు మార్లు దర్శించి, [[పచ్చల పతకాన్ని]], మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ [[పచ్చల పతకాన్ని]] [[గజ్జెల ప్రసాద్]] అనే [[స్టూవర్టుపురం]] గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
*[[1515]] లో [[రాయలు]], [[కొండవీడు]] ను ముట్టడించినాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]] [[కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున [[రాయలు]] విజయం సాధించాడు. తరువాత [[రాయలు]] [[కొండవీడు]] ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]] న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, [[రాయలు]]
[[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]] ని పూజించి అనేక దాన ధర్మాలు చేసినాడు.
 
పంక్తి 47:
* [[1947]] లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా [[విశాఖపట్టణం జిల్లా]]. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం]], విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.
 
* [[1950]]: [[విశాఖపట్నం జిల్లా]] నుంచి [[15 ఆగష్టు 1950]] న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది.
 
* [[1979]]: [[విశాఖపట్నం జిల్లా]] లోని కొంత భాగం, [[శ్రీకాకుళం జిల్లా]] నుంచి మరి కొంతభాగం కలిపి [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] ఏర్పడింది. దీనితో [[ఆంధ్రప్రదేశ్ ]] రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది.
 
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. రుషికొండ, రామకృష్ణ బీచ్ , భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే [[కొండకర్ల ఆవ]], తాటి దోనెల లో [[కొందకర్ల ఆవ]] లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు