పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: fi:Pushkar
పంక్తి 31:
[[File:Pushkar.jpg|thumb|left|సరస్వతి ఆలయం నుండి పుష్కర్ దృశ్యం]]
[[File:Templo a Brahmā en Pushkar, Rajasthan.jpg|thumb|right|పుష్కర్ ఆలయంలోని బ్రహ్మదేవుడు]]
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన [[పుష్కర్]] క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే [[బ్రహ్మ]]దేవునికి ఒక ఆలయం ఉన్నది. ప్రపంచంలో మొత్తంలో బ్రహ్మ దేవునికి వున్న ఆలయం ఇదొక్కటే. భారతదేశంలో ఉన్నతీథాలలోఉన్నతీర్థాలలో అతి పవిత్రమైనది ఈ పుష్కర్ తీర్థమే. అందుకే దీన్ని తీర్థ రాజమంటారు. దీన్ని దర్శించక పోతె తీర్థ క్షేత్రాల యాత్ర పూర్తి కానట్టే నని భావిస్తారు హిందూ మతస్తులు. ఈ స్థల పురాణంలో ఒక ఆసక్తి కరమైన కథ కలదు '''పద్మ పురాణం'''లో చెప్పబడిన కధను అనుసరించి పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రహ్మ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుదంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మద్య పుష్కర్, చివరిది కనిష్ట పుష్కర్. [[ బ్రహ్మ]] చేతి (కర) లోని పుష్పం నుండి రాలిన రెక్కతో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు వచ్చింది. బ్రహ్మ లోకకళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన '''రత్నగిరి''', ఉత్తరాన '''నీలగిరి''', తూర్పున '''సూర్యగిరి''' అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్తకాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనె [[సరస్వతి]] అని కూడ పిలుస్తారు) పిలుచుకొని రమ్మని తన కుమారుడైన నారదుని పంపాడు బ్రహ్మ. [[నారదుడు]] వెళ్లె సరికి ఆమె సిద్దంగానే నారదుడు " నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు? మీస్నేహితులను తీసుకరా " అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తనసహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. యజ్ఞవాటికయందు అందరు రుషులు, దేవతలు సిద్దంగా వున్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రంహ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడమని చెప్పి ఇంద్రుడు తీసుకు వచ్చిన ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో [[ఇంద్రుడు]] సమీపంలో పాలమ్ముకునే ఒక గుర్జర జాతి అమ్మాయి తీసుకొని వచ్చాడు. [[శివుడు]], [[విష్ణువు]] సలహామేరకు ఆ అమ్మాయిని గోవులోని కి పంపి శుద్దిచేసారు. అలాచేస్తే పునర్జన్మ ఎత్తినట్లని ఆ అమ్మాయికి అభ్యంగన స్నానం చేయించి సర్వాలంకారశోభితు రాలిని చేస్తారు, గోవుతో శుద్ధి చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన [[సావిత్రి]] అక్కడికి వచ్చి, బ్రహ్మప్రక్కన మరొక స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రహ్మ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్దాల్లో ఓటమి తప్పదని ఇంద్రుడిని, మానవ జన్మ ఎత్తి బార్య వియోగంతొ బాధపడతాడని విష్ణువును, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుడిని శపిస్తుంది. తర్వాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం వున్నది. అక్కడే చిన్న సెలఏరు కూడ వున్నది. దీన్నె సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలొ స్నానం చేస్తె నిత్య సుమంగళి గా వుంటారని భక్తుల నమ్మకం. సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాపవిముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞక్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందతారని శాపతీవ్రతను తగ్గిచింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయము దాని లాగ వుండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారతదేశంలో హిందువులు దర్శించే మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రశస్తిగాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం వున్నది.
 
=== చరిత్ర ===
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు