భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ta:பானுப்ரியா (நடிகை); పైపై మార్పులు
పంక్తి 10:
'''భానుప్రియ''' ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని [[బాలీవుడ్]] చిత్రాలలో కూడా నటించింది. ఈమె [[1967]], [[జనవరి 15]]న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన [[కూచిపూడి]], మరియు [[భరతనాట్యం]] నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో [[శ్రీదేవి]]గా పిలుచుకుంటుంటారు.
 
== సినీ జీవితం ==
భానుప్రియ [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]]తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. ఇటీవల సన్ నెటవర్క్ ఛానల్స్లో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
భానుప్రియ, భరతనాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను వివాహం చేసుకొని చెన్నైలో నివసిస్తుంది. వీరికి ఒక కుమార్తె ఉన్నది.
 
== భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు ==
{{col-begin}}
{{col-3}}
పంక్తి 56:
 
[[en:Bhanupriya]]
[[ta:பானுப்ரியா (நடிகை)]]
[[ml:ഭാനുപ്രിയ]]
[[zh:班奴·普麗婭]]
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు