ఖుషి: కూర్పుల మధ్య తేడాలు

చి Savithri_Mayabazaar_Colour.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Wknight94. కారణం: (No permission since 29 December 2010).
పంక్తి 31:
[[ఫైలు:khushibag.jpg|left|thumb|100px|"ఖుషీ బ్యాగ్" అంటే ఇదే!]]
 
[[కలకత్తా]] లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్,వావిలపల్లి శేఖర్ అనే వ్యక్తి పవన్ కల్యణ్ కి మంచి స్నేహితుడు. ఉన్నత విద్య కోసమై [[కెనడా]] బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తో [[హైదరాబాదు]] లో నే [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరతాడు. [[కైకలూరు]] లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత కి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయం లో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తో వారి ప్రేమ కి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
 
తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే, తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనం తో మధు సిద్ధూ కి మరింత దూరం అవుతుంది. తాము స్నేహితులు కామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధు కి గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటు తో ప్రేమ జంట ఏకం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఖుషి" నుండి వెలికితీశారు