తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
<poem>ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః | <poem>అనే శాంతి మంత్రము ఉన్నది.
 
==భృగువల్లి==
భృగుమహర్షి తన తండ్రి అయిన వరుణుని బ్రహ్మను గూర్చి తెలుపవలసినదిగా ప్రార్థించాడు. వరుణుడు తన కుమారుని జిజ్ఞాసకు ప్రీతి చెంది, అన్నము, ప్రాణము, చక్షుస్సు, శ్రోతము, మనస్సు, వాక్కు అనునవి బ్రహ్మప్రాప్తికి ద్వారభూతములని చెప్పి, బ్రహ్మము యొక్క లక్షణమును కూడా భృగువునకు ఉపదేశించెను.ఇది స్థూలముగా భృగువల్లి సారాంశము.
 
==నారాయణప్రశ్నము==
నారాయణప్రశ్నమునకు ఖిలకాండమనిపేరు.శ్రౌతసూత్రములో వినియోగంలేని మంత్రములు ఉండడంచేత ఆపేరు వచ్చింది.దీనికి [[యాజ్ఞికి]] అని కూడా పేరు ఉంది. సంధ్యావందనము, దేవతాపూజనము, వైశ్వదేవము మొదలైన కర్మప్రతిపాదకాలైన మంత్రాలు, యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఎక్కువగా ఉండడంచేత ఆ పేరు వచ్చింది. అంతమాత్రాన ఇది ఉపనిషత్తు కాదనడానికి వీలులేదు. దీనిలో ప్రారంభంలో బ్రహ్మతత్త్వప్రతిపాదనము, చివరలో దానిని సాధించడానికి ఉపయోగపడే సత్యాది సన్యాసాంత సాధనలున్నూ చెప్పబడ్డాయి కనుక దీనిని ఉపనిషత్తు అనడానికి ఏరకమైన సందేహం కనబడదు.