దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pt:Índia do Sul
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: pa:ਦੱਖਣੀ ਭਾਰਤ; పైపై మార్పులు
పంక్తి 2:
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నవి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము కలదు. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
 
== ఉపోద్ఘాతం ==
దక్షిణ భారతీయులు ముఖ్యంగా [[ద్రవిడ భాషలు]] మాట్లాడెదరు అనగా [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మలయాళం]].కానీ కొన్నిచోట్ల [[కొంకణి]], [[తుళు]] వంటి భాషలు కూడా మట్లాడెదరు. దక్షిణ భారతాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. అందులో ముఖ్యులు [[శాతవాహనులు]], [[ఆంధ్ర ఇక్ష్వాకులు]], [[చోళులు]], [[పాండ్యులు]], [[చేరులు]], [[చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]], [[హొయసల సామ్రాజ్యం|హొయసల]] మరియు [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]]. దక్షిణ భారత రాజవంశాలు [[శ్రీలంక]] మరియు [[శ్రీవిజయ]]లను జయించడం వలన ఇప్పటికీ దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం వారి జీవన విధానాలలో కనిపిస్తుంది.
 
పంక్తి 10:
 
== చరిత్ర ==
[[బొమ్మదస్త్రం:Chola country.png|thumb|200px|[[చోళులు|చోళ]], [[చేర]] మరియు [[పాండ్య]] రాజ్యాలు.]]
[[బొమ్మదస్త్రం:Chalukya_territories_lg.png|thumb|200px|క్రీ.శ.640లో రెండవ పులకేశి పాలనలో చాళుక్య రాజ్యము]]
[[బొమ్మదస్త్రం:chola_map.png|thumb|200px|left|క్రీ.శ.1014లో చోళ సామ్రాజ్యము]]
[[బొమ్మదస్త్రం:Madras Prov South 1909.jpg|thumb|200px|1909లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[మైసూరు రాజ్యము]] మరియు [[ట్రావెన్కూర్ రాజ్యము]]]]
 
[[కొత్తరాతియుగమున]]కు సంబంధించిన కొన్ని శిలలపై [[కార్బన్ డేటింగ్]] ద్వారా దక్షిణ భారతదేశపు ఉనికిని క్రీస్తుపూర్వం 8000కి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి ఆయుధాలు, మరియు కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతమునందు లభించాయి. క్రీస్తు పూర్వం 1000 నాటికి [[ఇనుప యుగం]] ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందినది. అయినా ఈ ఇనుప యుగానికి ముందు బాగా అభివృద్ధి చెందిన ఇత్తడి యుగం ప్రాచుర్యం పొందినట్లు ఆధారాలు లేవు <ref name="prehistory">Agarwal, D.P.[http://www.arkeologi.uu.se/afr/projects/BOOK/agrawal.pdf "Urban Origins in India"], 2006. Archaeology and Ancient History, Uppsala Universitet</ref>. దక్షిణ భారతదేశం మధ్యధరా ప్రాంతాన్ని మరియు తూర్పు ప్రాంతాన్ని కలిపే కూడలి వంటిది. [[కార్వార్]] నుంచి [[కొడంగళూర్]] వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు మరియు విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది<ref name= "Pillai"> T.K Velu Pillai, 1940; Wilfred Schoff 1912 "Periplus Maris Erythraei" (trans) 1912, Menachery, G 1998; James Hough 1893; K.V. Krishna Iyer 1971</ref>. మలబార్ ప్రాంతం వారు మరియు [[సంగం]] ప్రాంతానికి చెందిన తమిళులు [[గ్రీకులు]], [[రోమన్లు]], [[అరబ్బులు]], [[సిరియన్లు]], [[చైనీయులు]], [[యూదులు]] మొదలైన వారితో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది<ref name= "Blandstrom">(Bjorn Landstrom, 1964; Miller, J. Innes. 1969; Thomas Puthiakunnel 1973; & Koder S. 1973; Leslie Brown, 1956</ref>. దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు మరియు వంశాలు పరిపాలించాయి. [[అమరావతి]]ని రాజధానిగా పాలించిన [[శాతవాహనులు]], బనవాసి [[కదంబులు]], [[పశ్చిమ గంగ]] వంశము, [[బాదామి]] [[చాళుక్యులు]], [[చేర వంశము]], [[చోళులు]], [[హోయసాలులు]], [[కాకతీయులు|కాకతీయ]] వంశపు రాజులు, [[పల్లవులు]], [[పాండ్యులు]], మణ్యకేతమునకు చెందిన [[రాష్ట్ర కూటులు]] మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. [[మధ్య యుగం]] నాటికి దక్షిణ భారతంలో [[ముస్లింలు|మహమ్మదీయుల]] పెత్తనం పెరిగింది. 1323లో [[ఢిల్లీ సుల్తాన్]] [[ముహమ్మద్ బిన్ తుగ్లక్]] సేనలు [[ఓరుగల్లు]]ను పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. [[గుల్బర్గా]]కు (తరువాతి కాలంలో [[బీదర్]]కు మార్పు) చెందిన [[బహమనీ సుల్తానులు|బహమనీ సామ్రాజ్యం]], మరియు [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] (ఇప్పటి [[హంపి]]) చెందిన రాజులకు జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం మరియు బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహి వంశస్తులు]] ప్రధాన రాజులయ్యారు. [[ఔరంగజేబు]] నాయకత్వంలోని మొఘాలాయి సేనలు దక్షిణ ప్రాంతాన్ని ముట్టడించేవరకు (7వ శతాబ్దం మధ్యవరకూ) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢీల్లీ నుంచి స్వయం ప్రతిపత్తిని సంపాదించుకున్నారు. [[మైసూరు]] సామ్రాజ్యానికి చెందిన [[ఒడయార్లు]], [[హైదరాబాదు]]కు చెందిన [[ఆసఫ్ జాహీ]]లు, [[మరాఠీ]]లు అధికారాన్ని పొందగలిగారు.
 
పద్దెనిమిదవ శతాబ్దం మద్య భాగంలో అటు [[ఆంగ్లేయులు]], ఇటు [[ఫ్రెంచి వారు]] దక్షిణ భారతదేశము యొక్క సైనికాధికారానికి ధీర్గకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలచే ఏర్పాటు చేయబడ్డ కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధం, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధం వలన [[మైసూరు]], [[పూణె]], [[హైదరాబాద్]] వంటి నగరాలు కొన్ని బ్రిటిష్ వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో దక్షిణ భారతదేశాన్ని, [[మద్రాసు ప్రెసిడెన్సీ]], [[హైదరాబాదు]], [[మైసూరు]], [[తిరువిత్తంకూర్]] ('ట్రావెంకూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచి' ([[కొచ్చిన్]] లేదా ''పెరంపదపు స్వరూపం''), [[విజయనగరం (కర్ణాటక)|విజయనగరం]] మరియు ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు.
పంక్తి 22:
{{seealso|భారతదేశ చరిత్ర}}
 
== భౌగోళిక స్వరూపం ==
[[బొమ్మదస్త్రం: South India satellite.jpg|200px|thumb|2003, జనవరి 31న [[నాసా]] ఉపగ్రహము తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రము.]]
దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న [[ద్వీపకల్పం]]. ఎల్లలుగా తూర్పున [[బంగాళాఖాతం]], పశ్చిమాన [[అరేబియా సముద్రం]] మరియు ఉత్తరాన వింధ్య సాత్పురా పర్వతాలు కలవు. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా మరియు మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. [[నర్మద]] నది వింధ్య మరియు సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పుర పర్వతాలు డెక్కను పీఠభాగానికి ఉత్తరం వైపు ఎల్లగా వుంది. అలాగే [[పశ్చిమ కనుమలు]] (Western Ghats) మరొకవైపు ఎల్లలుగాను ఉన్నాయి. పశ్చిమకనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని [[కొంకన్]] అని నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని [[గోవా]] అని అంటారు.
పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి [[మలనాడ్]], [[కెనరా]] ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన [[నీలగిరి]] పర్వతాలతో అంతమౌతాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రకారంలో ఉండి [[తమిళ నాడు]],[[కేరళ]], [[కర్ణాటక]] సరిహద్దుగా ఉన్న [[పాలక్కాడ్]] మరియు [[వేనాడ్]] కొండలు, ఇంకా [[సత్య మంగళం]] అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. [[తిరుపతి]] మరియు [[అన్నామలై]] కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.
పంక్తి 31:
[[కావేరి (నది)|కావేరి]] నది కర్ణాటకకు చెందిన [[కొడగు]] జిల్లాలోని పశ్చిమ లోయలయందు ఉద్భవించి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి తమిళనాడు తూర్పు తీరాన మంచి సారవంతమైన మరియు విశాలమైన డెల్టా భూములను ఏర్పరుస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రధానమైన నదులైన కావేరి, [[గోదావరి]] మరియు [[కృష్ణా నది|కృష్ణ]] బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి సస్యశ్యామలం చేసే ప్రాంతాన్ని అన్నపూర్ణ అని వ్యవహరిస్తారు. పశ్చిమాన అరేబియన్ సముద్రం వైపు ప్రవహించే నదుల్లో [[పెరియార్]], [[నేత్రావతి]], [[మాండోవి]], [[తపతి]] మరియు [[నర్మద]] ముఖ్యమైనవి.
 
=== ప్రాంతాలు ===
దక్షిణ భారతంలోని 4 ముఖ్య రాష్టాలు భాషాపరమైన ప్రాంతీయ హద్దులు కలిగివున్నాయి. ప్రాంతీయ పరంగా హద్దులు ఉన్నప్పట్టికీ, సాంస్కృతికంగా లేక చారిత్రికంగా లిఖించబడని ప్రాంతాలు పలుచోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు:
* [[కర్ణాటక ప్రాంతం]] - ''దక్కన్'' అనే పదానికి సంబంధించినది, దక్షిణ భారత దేశమంతటికీ వర్తిస్తుంది.
పంక్తి 60:
తీర ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ఉండే [[లక్షదీవులు]]కు చెందిన పగడపు దీవులు, నైరుతీ తీరానికి దూరంగా ఉంటాయి. [[శ్రీలంక]] ఆగ్నేయ తీరం వైపుకు [[పాక్ జలసంధి]] మరియు [[రామ సేతు]] వంతెనతో భారతదేశం నుంచి వేరు చేయబడి ఉంది. [[అండమాన్ నికోబార్ దీవులు]] భారత తూర్పు తీరానికి దూరంగా [[బర్మా]] తీరమైన [[టెనాసెరీం]]కి దగ్గరగా ఉంటాయి. హిందూ మహాసముద్రం ఒడ్డున గల [[కన్యాకుమారి]] భారతదేశానికి దక్షిణం వైపు కొన భాగం.
 
=== ప్రకృతి (వృక్ష సంపద మరియు జంతు సంపద) ===
[[బొమ్మదస్త్రం:Kerala India trees.jpg|thumb|200px|దట్టమైన చెట్లతో నిండి ఉన్న కేరళలోని [[సైలెంట్ వ్యాలీ జాతీయ వనం]]]]
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, మరియు ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.
 
పంక్తి 71:
పశ్చిమ కనుమలకు చెందిన [[అన్నామలై]] కొండలు, [[నీలగిరి]] కొండలు, ఆంధ్రప్రదేశ్‌లో గల [[పులికాట్]] సరస్సు, తమిళనాడుకు చెందిన [[పిఛావరం]], కేరళకు చెందిన [[వెంబనాడు]], [[అష్టముది]] సరస్సు, మరియు [[కాయంకుళం]] సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల [[ముడుమలై జాతీయ వనం]],[[బందిపూర్ జాతీయ ఉద్యానవనం]], [[నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనం]], మరియు [[వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి [[నీలగిరి అభయారణ్యాలు]] కిందకి వస్తాయి.
 
== జనాభా వివరాలు ==
 
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మరియు తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం మీద 233 మిలియన్ జనాభా ఉన్నారు.<ref name=demographics>{{cite web |url=http://www.censusindiamaps.net/page/Religion_WhizMap1/housemap.htm |title=Census India Maps |accessdate=2006-04-11}}</ref>. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో [[ఆంధ్రులు]], [[తమిళులు]], [[కన్నడిగులు]], [[మలయాళీలు]], మరియు [[కొంకణీయులే|కొంకణీయులు]] అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. [[రోమన్ కాథలిక్]] , [[ఇండియన్ ఆర్థోడాక్సు]], [[సిరియన్ జాకోబైట్]], [[ప్రొటెస్టంట్లు]], [[సైరో-మలబార్]], మరియు [[మర్తోమా]] మొదలైనవి కొన్ని క్రైస్తవ సాంప్రదాయాలు. [[జైనులు]], [[బౌద్ధులు]], [[యూదులు]], మరియు ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.
 
 
[[బొమ్మదస్త్రం:Mattancherry palace bhagvathy kshetram.JPG|170px|thumb|left|సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)]]
దక్షిణ భారతదేశం సగటు అక్షరాస్యతా శాతం దాదాపు 73%.ఇది భారతదేశపు సగటుకన్నా ఎక్కువ(60%). <ref name="ciaindia">{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html |title=CIA factbook |accessdate=2006-04-11}}</ref> కేరళ 91% అక్షరాస్యతా శాతంతో దేశంలో అగ్రస్థానాన్ని అలంకరించింది. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి 997 (అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు). దేశంలోకల్లా ఒక్క కేరళలో మాత్రమే ఈ నిష్పత్తి వెయ్యి కంటే ఎక్కువగా ఉంది.<ref name="demographics"/>. ఈ ప్రాంతంలో [[జనాభా సాంద్రత]] సుమారుగా 463. జనాభాలో 18% షెడ్యూల్డు కులాలు మరియు తెగలకు చెందిన వారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. 47.5% మంది వ్యవసాయ సంభందమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. 60% మంది ప్రజలు శాశ్వత గృహ వసతి కలిగి ఉన్నారు. 47.8% శాతం మంది రక్షిత మంచినీటిని పొందగలుగుతున్నారు. [[ఊట బావులు]] కూడా చాలామందికి నీటిని సరఫరా చేస్తాయి. 31% శాతం మందికి ముఖ్య ప్రయాణ సాధనం సైకిలే. 36.7% శాతం మంది టివి వీక్షించగలరు. రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడే [[దూర దర్శన్]] మరియు ఇతర ప్రాంతీయ ఛానళ్ళు చాలా ఉన్నాయి.
 
=== ప్రధాన భాషలు ===
{{ద్రవిడ భాషల వంశ వృక్షం}}
దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి. <ref>[http://www.ethnologue.com/show_family.asp?subid=90422 Language Family Trees - Dravidian.] [[Ethnologue]].</ref>. ద్రవిడ భాషల పుట్టుక మరియు వివిధ భాషల తో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరు వేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి [[తెలుగు]], తమిళం, కన్నడ మరియు మలయాళం. ద్రవిడ భాషలను దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించవచ్చు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు మరియు గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్త్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.
పంక్తి 85:
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ మరియు 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం భాషలను భారత దేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా(Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. [[ఇండో-ఆర్యన్]] సమూహానికి చెందిన కొంకణి భాషను [[గోవా]], [[కోస్తా కర్ణటక]], [[కేరళ]] మరియు [[మహారాష్ట్ర]]ల యందు విరివిగా మాట్లాడుతారు. [[కొంకణి]] భాష మీద కన్నడ మరియు మలయాళం భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను మరియు కొంకణ్ ప్రాంతాలలో [[మరాఠి]] ఎక్కువగా మాట్లాడుతారు. [[బార్కూరు]] సమీపంలో [[తులు]] బాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.
 
== ఆదాయ వనరులు ==
{{main|దక్షిణ భారత దేశ ఆర్థిక వ్యవస్థ}}
 
పంక్తి 106:
గత కొద్ది కాలం నుంచి ఐటి కంపెనీల వేతనాలు భారీగా ఉండటం మూలాన, వాటిలో పని చేసే విద్యావంతులైన యువత మంచి ఆదాయాలు గడిస్తున్నారు. మరొక వైపు పేదవారు తమ కనీస అవసరాలు తీరక అవస్థ పడుతున్నారు. మహానగరాల్లో బహుళ అంతస్థుల భవంతుల మధ్య ఇళ్ళు లేని వారు వేసుకొన్న చిన్న చిన్న గుడారాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. తమ పిల్లలను కనీసం పాఠశాలకు కూడా పంపలేక అలాగే పేదరికంలో మగ్గుతున్న వారు ఉన్నారు. {{Fact|date=February 2007}}
 
== రాజకీయాలు ==
[[బొమ్మదస్త్రం:Cpmernakulam (40).jpg|thumb|200px|[[కేరళ]] లో [[లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్]] పార్టీ ర్యాలీ.]]
{{main|దక్షిణ భారతదేశంలో రాజకీయాలు}}
దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీలైన [[భారత జాతీయ కాంగ్రెస్]], [[భారతీయ జనతా పార్టీ]], మరియు [[కమ్యూనిస్టు పార్టీ]]లు సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. [[కర్ణాటక]]ను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలోనూ కనీసం రెండు రాజకీయ పార్టీలు ప్రభలంగా ఉన్నాయి.
పంక్తి 118:
[[ఆంధ్ర ప్రదేశ్]] లో మెజారిటీ కుసస్థులు [[కమ్మ]] (కమ్మ నాయుడు), [[రెడ్డి]] మరియు [[కాపు]], [[కర్నాటక]] లో [[వొక్కలిగ]] మరియు [[లింగాయతులు]], [[కేరళ]] లో [[నాయర్]] లేదా [[ఎలవ]], [[మహారాష్ట్ర]] లో [[కుంబి]]. సాధారణంగా ఈ కులస్థుల వారే [[ముఖ్యమంత్రి]] పదవిని అధిష్టిస్తారు. [[తమిళనాడు]] లో మెజారిటీ కులస్థులు [[వెన్నియార్]]లు, [[కొంగువెల్లలార్]]లు మరియు [[తేవార్]]లు. [[పి.యం.కే.]] అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీని సూచించాడు. <ref name=tamilpolitics>Harris, Wyatt. [http://www.dcrcdu.org/dcrc/John%20Harriss.doc. "The Changing Politics of Tamil Nadu in the 1990s"]. <u>Political Mobilisation and Political Competition</u>. Dec 2004.</ref>
 
[[బొమ్మదస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] అసెంబ్లీభవనం [[విధాన సౌధ]].]]
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీ తో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]] మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన [[నారా చంద్రబాబు నాయుడు]]ను సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుదు దక్షినాది లో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో [[వై. యస్. రాజశేఖర రెడ్డి]] నాయకత్వంలో , తెలంగాణా రాష్ట్ర సమితి తో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.
 
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా , కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపి లు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]] మరియు [[లింగాయతులు]] అనే రెండు కులాలు శాసిస్తున్నాయి. <ref name="karnatakapolitics">Price, Pamela. [http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf" Ideological Elements in Political Instability in Karnataka..."]. <u>University of Oslo</u></ref>. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, [[రామక్రిష్ణ హెగ్డే]] ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన [[ హెచ్ డి దేవెగౌడ]] (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.
 
ఇక కేరళ విషయానికొస్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని, [[ఐక్య ప్రజాతంత్ర కూటమి]] (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్), మరియు [[లెఫ్ట్]] నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధానమైనవి. లెఫ్ట్ కంచుకోటల్లో కేరళ కూడా ఒకటి. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టులు ఒకరు మార్చి ఒకరు అధికారంలోకి రావడం ఇక్కడ విశేషం.
 
== సంస్కృతి వారసత్వ సంపద ==
[[బొమ్మదస్త్రం:Tyagaraja.jpg|thumb|200px|[[కర్ణాటక సంగీతము]] లో త్రిమూర్తులలో ఒకరైన [[త్యాగరాజు]].]]
{{main|దక్షిణ భారత సంస్కృతి}}
 
దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, భారత దేశము మొత్తము పై బడ్డ విదేశీయుల ప్రభావము వలన సంస్కృతి పై కూడా ప్రభావము కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయము ప్రకారము దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి"(వెల్టన్‌షవాంగ్([http://en.wikipedia.org/wiki/Weltanschauung weltanschauung]) శరీర సౌందర్యము ను [[మాతృత్వము]] ను ఆస్వాదించడము ద్వారా అనంతమైన [[విశ్వము]] ను అస్వాదించడము. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వార వ్యక్తమవుతున్నది. <ref name="beck"> Beck, Brenda. 1976; Bharata, 1967; Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss, 2002; Wadley, Susan, ed. 1980</ref>
 
 
పంక్తి 137:
భారతీయ తత్వ శాస్త్రం ప్రకారం [[బ్రహ్మ]] యొక్క నాభి (బొడ్డు) సకల జీవ సృష్టికి ఆధార భూతమైనది. దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియనప్పటికీ నాభి భాగాన్ని, పొట్టనూ మూసి వేయకుండా అలాగే వదిలి వేస్తారు. ప్రాచీన [[నాట్యశాస్త్రం]] వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా నాభి భాగాన్ని కప్పుకోకుండా వదలి వేయడం వలన ''ఆంగికం భువనం యస్య'' ( భగవంతుని శరీరమే ప్రపంచమనే భావన) ఈ సంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది.<ref name="beck"> Beck, Brenda, 1976; Bharata, 1967</ref> స్ర్తీలు సాంప్రదాయంగా [[చీర]]ను ధరిస్తారు, అలాగే పురుషులు [[లుంగీ]] లేదా [[ముండు]] ను ధరిస్తారు.<ref name="Boulanger"> Boulanger, Chantal; 1997</ref>
 
దక్షిణ భారతదేశ సంగీతాన్ని [[కర్ణాటక సంగీతం]] అని వ్యవహరిస్తారు. ఇది [[పురందర దాసు]], [[కనక దాసు]], [[త్యాగరాజు]], [[అన్నమయ్య]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామ శాస్త్రి]], [[సుబ్బరాయ శాస్త్రి]], [[మైసూరు వాసుదేవాచార్యులు]], మరియు [[స్వాతి తిరునాళ్]] వంటి వాగ్గేయ కారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. సమకాలిక గాయకుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [[కె.జె. యేసుదాసు]] (జేసుదాసు), శ్రీమతి పట్టమ్మాళ్, కర్ణాటక సంగీతంలో ప్రముఖులు. భారత రత్న[[కీ.శే.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], కీ.శే.మహరాజపురం విశ్వనాథన్, కీ.శే.మహరాజపురం సంతానం, కీ.శే.చెంబై వైద్యనాధభాగవతార్, కీ.శే.శంభంగుడి శ్రీనివాస అయ్యర్ ప్రభృతులు కర్ణాటక సంగీతాన్ని తారాపథానికి తీసికెళ్ళిన నిన్నటి తరపు విద్వాంసులలో కొందరు.
 
[[బొమ్మదస్త్రం:gandharva.jpg|right|thumb|220px|[[యేసుదాస్]], [[కర్నాటక సంగీతం]] లో దిట్ట.]]
తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సాంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో [[పద్మరాజన్]] తీసిన [[నమ్ముక్కుపార్కాన్]], 1984లో [[జి వి అయ్యర్]] తీసిన [[ఆది శంకర]], 1990లో పెరుంతాచన్ తీసిన [[అజయన్]], 1984 లో [[విశ్వనాథ్]] తీసిన [[శంకరాభరణం]] ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.
 
[[బొమ్మదస్త్రం:Bharatanatyam_17.jpg|left|thumb|200px|[[భరతనాట్యం]] కళాకారిణి.]]
దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆల వాలమైంది. [[భరతనాట్యం]], [[కూచిపూడి]], [[కథాకళి]], [[యక్షగానం]], [[తెయ్యం]], [[ఒట్టంతుళ్ళ]], [[ఒప్పన]], [[కేరళ నటనం]], మరియు [[మొహినీ అట్టం]] ఇందులో ప్రధానమైనవి. భరత నాట్యం భువనైక సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. <ref name="Kallarasa"> Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, 1974.</ref> వీరు ''నాట్య శాస్త్రం'' యొక్క తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే '''అరైమండి''' అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మద్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము మరియు పుట్టుక కలయికయైన్ '''నాట్యపురుషుని''' వ్యక్తీకరిస్తుంది. <ref name="beck"> Beck, Brenda, 1976; Bharata, 1967</ref>
 
[[బొమ్మదస్త్రం:Lunch from Karnataka on a plantain leaf.jpg|thumb|200px|అరటి ఆకులపై భోజనం వడ్డించే సాంప్రదాయం(ముఖ్యంగా పండుగ దినాలలో)]]
ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం [[అన్నము]]. చేపలు, కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో ఒక అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. [[దోశ]], [[ఇడ్లీ]], [[ఊతప్పం]] మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.
 
దక్షిణ భారతదేశంలో రెండు ప్రధానమైన వాస్తు శిల్పకళా రీతులు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు చెందిన సంపూర్ణ ద్రవిడ విధానం కాగా మరొకటి కర్ణాటకకు చెందిన [[వేసర]] శిల్పకళ. [[హంపి]], [[బాదామి]], [[భట్టిప్రోలు]], [[పట్టాడక]], [[అహోబిలం]],[[బేలూరు]], [[హళిబేడు]], [[లక్కుండి]], [[శ్రావణబెళగొళ]], [[మహాబలిపురం]], [[తంజావూరు]], [[మధురై]] మొదలైన దేవాలయాలలోగ శిల్పకళ ఇక్కడి శిల్పుల నైపుణ్యానికి, కళాభిరుచికీ చక్కటి నిదర్శనాలు. [[రాజా రవివర్మ]] గీసిన చిత్రాలు దక్షిణ భారతదేశ సాంప్రదాయాన్ని,పురాణాల్నీ చక్కగా ప్రతిబింబిస్తాయి. ఎట్టమునూర్ లో గల శైవ క్షేత్రం, మరియు మాతంచేరి దేవాలయంలో గల చిత్రాలు [[:en:Dravidian mural painting|ద్రవిడ దేశపు కుడ్యచిత్రాలకు]] కొన్ని ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో 5 నుంచి 26 దాకా చరిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన స్థలాలు ఉన్నాయి. <ref>[http://whc.unesco.org/en/statesparties/in World Heritage Listed Sites in India]. URL accessed on [[April 12]], [[2006]].</ref>
 
[[బొమ్మదస్త్రం:Gomateswara.jpg|thumb|200px|left|కర్నాటక లోని [[గోమఠేశ్వర]] వద్ద, జైనుల తీర్థాంకరుడు 'బాహుబలి' ఏకశిలా శిల్పం. (978-993 నాటిది).]]
[[బొమ్మదస్త్రం:thanjavur_temple.jpg|thumb|200px|[[తంజావూరు]] లోని [[బృహదీశ్వరాలయం]] ప్రధాన విమానం.]]
 
నృత్యం తరువాత [[శిల్పకళ]] ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ మరియు పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.<ref name="Dehejia">Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss; 2002</ref>
 
దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ [[సంగం]] కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన ''[[కవిరాజమార్గ]]'' అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన [[దుర్వినీతుడు]] అనే రాజు యొక్క రచనలను గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు ''నెమ్రినాథం'' నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మళయాళం, తెలుగు సాహిత్య సాంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన [[శిలప్పాధికారం]] (దీనినే [[సిలప్పాటికారం]] అనికూడా అంటారు) లాంటి రచనలు గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన [[తొల్కప్పియం]], మరియు [[తిరువళ్ళువర్]] రచించిన [[తిరుకురల్]] కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో మరియు తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.
 
== భిన్నత్వం ==
[[బొమ్మదస్త్రం:Charminar Hyderabad.jpg|thumb|180px|[[హైదరాబాదు]] లోని [[చార్మినారు]].]]
కొన్ని శతాబ్దాల క్రిందట [[జైనమతం]] ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి [[శైవ భక్తులు]], [[వైష్ణవులు]] ప్రధానమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాలు. కర్ణాటకలో గల [[శ్రావణబెళగొళ]] జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల [[కొడగు]] అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక [[టిబెట్ ]] నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి [[మలబారు తీరం]] ప్రజల్లో, ఒమన్ మరియు ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంభంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో [[నాగపట్టణం]](నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన [[నాగూర్ దర్గా]] కూడా ఉంది. ఇక ఆంధ్ర రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. [[చార్మినార్]], [[పాతబస్తీ]] లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు.
సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.<ref name= "LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి.<ref name= "LeslieBrown">Menachery G; 1973, 1998; Mundalan, A. M; 1984; Podipara, Placid J. 1970; Leslie Brown, 1956</ref>. The two [[Eastern Catholic Churches]] have their Holy See in Kerala. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మరియు మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సాంప్రదాయాల నుంచి ఉద్బవించింది.<ref name= "LBrown">Menachery G; 1973, 1998; Leslie Brown, 1956; Vellian Jacob 2001; Weil, S. 1982; Poomangalam C.A 1998</ref>
 
[[బొమ్మదస్త్రం:Kottayam Valia Palli02.jpg|170px|thumb|left|[[క్నానయ]], సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, [[కొట్టాయం]], ఇందులో పురాతన మార్ థోమా క్రాస్ మరియు సస్సానిదుల పహ్లవీ లిపులు.]]
అంతేకాకుండా కేరళలో లాటిన్ సాంప్రదాయానికి చెందిన రోమన్ క్యాథలిక్కులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వివిధ ప్రొటెస్టంట్ విభాగాలన్నింటినీ కలిపి [[1947]] లో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర [[ప్రొటెస్టంట్]] చర్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఇక్కడ యూదు జాతికి చెందిన ప్రజలు కూడా కొద్ది మంది నివసిస్తున్నారు. వీరు సాల్మన్ చక్రవర్తి కాలంలో మలబార్ తీరానికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. <ref name="Koder">David de Beth Hillel, 1832; Lord, James Henry, 1977; Thomas Puthiakunnel 1973; Koder S. 1973</ref>
కేరళ లోని [[కొచ్చిన్]] లో గల యూదుల చర్చి [[సినగాగ్]], భారత్ లో అతి ప్రాచీనమైనది.
 
== నోట్స్ ==
<div class="references-small"><references/></div>
 
== మూలాలు మరియు రచనలు ==
<div class="references-small">
* Beck, Brenda. 1976. “The Symbolic Merger of Body, Space, and Cosmos in Hindu Tamil Nadu." Contributions to Indian Sociology 10(2): 213-43.
పంక్తి 178:
* Dehejia, Vidya, Richard H. Davis, R. Nagaswamy, Karen Pechilis Prentiss (2002) The Sensuous and the Sacred: Chola Bronzes from South India. ISBN 0-295-98284-5
* Hart, George, ed. and trans. 1979. Poets of the Tamil Anthologies: Ancient Poems of Love and War. Princeton: Princeton U. Press
* Kallarasa Virachita Janavasya Ed: G.G. Manjunathan. Kannada Adhyayana Samsthe, University of Mysore, Mysore 1974.
* Gover, Charles. 1983 (1871). Folk-songs of Southern India. Madras: The South India Saiva Siddhanta Works Publishing Society.
* Nagaraju, S. 1990. “Prehistory of South India.” In South Indian Studies, H. M. Nayak and B. R. Gopal, eds., Mysore: Geetha Book House, pp. 35-52.
పంక్తి 189:
* Mundalan, A. Mathias. (1984) ''History of Christianity in India'', vol.1, Bangalore, India: Church History Association of India.
* Leslie Brown, (1956) ''The Indian Christians of St. Thomas. An Account of the Ancient Syrian Church of Malabar'', Cambridge: Cambridge University Press 1956, 1982 (repr.)
* Podipara, Placid J. (1970) "The Thomas Christians". London: Darton, Longman and Tidd, 1970.
* Menachery G (ed); (1998) "The Indian Church History Classics", Vol. I, ''The Nazranies'', Ollur, 1998. [ISBN 81-87133-05-8].
* David de Beth Hillel (1832) "travels"; madras publication;
పంక్తి 202:
* Koder S. 'History of the Jews of Kerala". The St. Thomas Christian Encyclopaedia of India, Ed. G. Menachery,1973.
* Vellian Jacob (2001) Knanite community: History and culture; Syrian church series; vol. XVII; Jyothi Book House, Kottayam
* Weil, S. (1982) "Symmetry between Christians and Jews in India: The Cananite Christians and Cochin Jews in Kerala. in Contributions to Indian Sociology,16.
* Bjorn Landstrom (1964) "The Quest for India", Double day English Edition, Stockholm.
* T.K Velu Pillai, (1940) "The Travancore State Manual"; 4 volumes; Trivandrum
* Caldwell, R (1998) "A comparative grammar of the Dravidian or South-Indian family of languages" 3rd ed. rev. and edited by J.L. Wyatt, T. Ramakrishna Pillai. New Delhi : Asian Educational Services. ISBN 81-206-0117-3
* Bloch, J. (1954) "The grammatical structure of Dravidian Languages". tr. of 'Structure grammaticale des langues Dravidiennes' (1946) Poona: Deccan College Handbook Series.
</div>
 
 
[[వర్గం:దక్షిణ భారతదేశం| ]]
Line 231 ⟶ 230:
[[nl:Zuid-India]]
[[no:Sør-India]]
[[pa:ਦੱਖਣੀ ਭਾਰਤ]]
[[pt:Índia do Sul]]
[[ru:Южная Индия]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు