కేదార్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==ప్రయాణ సౌకర్యాలు==
రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 2000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్తముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. సాయంత్రం 7తర్వాత ఈ రూటులో ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీపరులు. దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు. డబ్బైనా, వస్తువులైనా ఇబ్బంది లేదు.
రిషికేశ్ నుండి హరిద్వార్‌ వరకు పోయే మార్గంలో ఉన్న గౌరీకుండ్ నుండి కాలిబాటనలో 14 కిలోమీటర్ల కేదార్‌నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. ఈ గుడిని కాలి బాటలో నడవడం ద్వారా గుర్రాలమీద, మరియు డోలీ ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ యాత్రీకులు కొరకు గురాలు, డోలీలు బాడుగ చెల్లిస్తే లభిస్తాయి. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతియ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
గౌరీకుండ్ నుండి కాలిబాటనలో 14 కిలోమీటర్ల కేదార్‌నాధుని గుడి ప్రతిష్టితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది.
ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ,కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం.. నాలుగు కిలోమీటర్ల తర్వాత చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతియ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.
 
==ఆలయ మార్గం==
"https://te.wikipedia.org/wiki/కేదార్‌నాథ్" నుండి వెలికితీశారు