విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: as:শিক্ষা; పైపై మార్పులు
పంక్తి 30:
వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. [[సర్వ శిక్షా అభియాన్]] అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి [[అందరికీ విద్య]] కార్యక్రమాన్ని ఇటు [[కేంద్ర ప్రభుత్వం]], అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. [[నేషనల్ లిటరసీ మిషన్]] లేదా జాతీయ [[అక్షరాస్యత]] మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో [[సంపూర్ణ అక్షరాస్యత]] కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో [[అక్షర తపస్మాన్]] అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.
 
== విద్యా విధానాలు ==
 
;నియత విద్య:- పరిణామక్రియ ఆధారంగా, [[శారీరక వయస్సు]] మరియు [[మానసిక వయస్సు]] ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను [[నియత విద్య]] అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు [[కర్రికులమ్]], [[కాలపట్టిక]]లు, [[బోధన]], [[మూల్యాంకనము]], పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
పంక్తి 42:
=== ప్రత్యామ్నాయ విద్య ===
 
[[ప్రత్యామ్నాయ విద్య]] అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం, [[పాఠశాలనుండి వైదొలగేవారిని]] తగ్గించడం. దీనికొరకు [[ సార్వత్రిక పాఠశాల]] (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.
 
== బోధనాంశాలు ==
పంక్తి 170:
[[an:Educación]]
[[ar:تعليم]]
[[as:শিক্ষা]]
[[ast:Educación]]
[[az:Təhsil]]
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు