అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంప...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు నీతి, మంచి బుద్దులు పాటల రూపంలో చెప్పేవారు. ఈ పాటలను అప్పగింతల పాటలు అనేవారు. అప్పగింతలపాటల్లో స్త్రీ తన అత్తవారింట ఎలా మెలగాలి, మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి వంటి విశేషాలు ఉంటాయి.
వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి పంపేటప్పుడు పెళ్ళికూతురి తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
 
పాట - 1
 
"అత్తగారింటికి అంపించవలె నిన్ను ,
అతిబుద్ధి గలిగుండు అంబరో నీవు
 
నీతి వాక్యములను నిర్మించి చెప్పెద,
ఖ్యాతితో నుండుము నాతిరో నీవు
 
బిడ్డరో వినవమ్మ బిరుసు మాటలు నీవు
అరయబల్కకు తల్లి అత్తవారింటిలో
 
ఓర్పు సిగ్గులు గల్గి ఒరుల ఇంటికిబోక,
ఒప్పిదంబుగ నుండు ఓ బిడ్డ నీవు
 
తల్లిమారు అత్త తగ జూడవే బిడ్డ,
జగడమాడకు తల్లి జవ్వనుల తోడ
 
తల్లిమారు మామ తనవలె వదినెలు,
కనవలె ఈ రీతి కపటంబు లేక
 
మగువ కొడుకుల మారు మరదులను భావించి,
కరుణగలిగుండవే కమలాక్షి నీవు
 
ఎవ్వరికీ ఎదురుగా బదులు మాట్లాడక,
బెదరి ఉండుము తల్లి భేదంబు లేక
 
తత్తరంబది విడిచి అత్తగారీ మాట,
చిత్తమున జేర్చుకో చిత్తారు బొమ్మ
 
తలకొంగు మరువకు తలెత్తి చూడకు,
పడతులతో వాదు వలదు మాయమ్మ
 
పెద్దలు పిన్నలు వచ్చు మార్గము దెలిసి ,
గద్దె పై గూర్చున్న గ్రక్కున దిగవే
 
హరిపగిది నీ మొగుడు అరయ దేవుడంతడు,
ధరణి యిద్దరు నీకు దైవసములమ్మ"
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు