విశాఖ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
=== విశాఖనక్షత్రము గుణగణాలు ===
విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితము ప్రారంభం ఔతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తాల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలౌతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చెస్తారు. విరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవదము వ్యర్ధము. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లెక స్త్రి సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చెస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగము వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చెసె ఉద్యోగానికి సమ్బంధము ఉండదు. ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారము ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టము ప్రయోజనము సమముగా ఉంటాయి. కథినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీపౌరసత్వము లభిస్తుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటారు.
కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/విశాఖ_నక్షత్రము" నుండి వెలికితీశారు