శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం): కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు
పంక్తి 33:
| website =
}}
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|leftright|250px|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని [[ఖమ్మం జిల్లా]] [[భద్రాచలం]]లో ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పురాతన,పెద్దపెద్దది. [[హిందువులు]] ఆరాధ్య దైవంగా భావించే [[శ్రీరాముడు|శ్రీరాముని]] ఆలయం ఇది. ప్రతి సంవత్సరం [[శ్రీరామనవమి]] రోజున ఈ [[దేవాలయం|దేవాలయ]] ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
==దేవాలయ నిర్మాణ విశేషాలు==
17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు [[శ్రీరామదాసు]]గా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉన్నది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనంను ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఈయనను బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక [[సంకీర్తన]]లను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం మరియు విజయనగరం ప్రాంతాలకు [[రామాయణం]]తో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంధాల ద్వారా తెలుస్తున్నది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల నందు రాముడు, సీత మరియు లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలం కి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.