"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఎండిన దానిమ్మ కాయ===
బక్కచిక్కి, నీరసంగా ఉండటం.నునుపు నిగనిగ తగ్గిపోయి ఎండిపోయి కనిపించటం.
===ఎంత పండినా కూటిలోకే===
ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన
 
===ఎకరమంత===
సువిశాలమైనది బాగా పెద్దది
===ఎక్కడ తగలడ్డావు ఇంత సేపు===
కోపంతొ ''ఎక్కడున్నావూ' ఇంతసేపు అనడానికి ఇలా అంటారు.
 
===ఎగదిగ===
తేరిపార చూచుట
===ఎదుగు పొదుగు===
అభివృద్ది .... వాడి ఉద్యోగం ఎదుగు బొదుగు లేక ఎక్కడ వేసిని గొంగళి చందాన అక్కడే వున్నది.
 
===ఎదురు బొదురు===
చుట్టుపక్కల వారు అని అర్థం.
===ఎన్నెర్ర కన్నెర్ర===
ఎన్నుఅంటే వెన్ను కంకి, వెన్ను ఎర్రపడటం అంటే పంట ,,4125
 
===ఎముకలు మెళ్లో వేసుకు తిరిగినట్లు===
చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం.చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం
===ఎలవెట్టి కయ్యం కొనుక్కున్నట్టు===
లేనిపోనిది కొని తెచ్చుకున్నట్టు, వెల ఇచ్చి మరీ తగాదాను కొని తెచ్చు కోవటం
 
===ఎల్లమ్మ కొలుపు===
చాలాసేపు జరిగే పని.ఎల్లమ్మ కొలుపుల్లా ఇంకా ఎంతసేపు ఆ పని చేస్తారు, త్వరగా కానీయండిఅంటారు.
===ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
 
==ఎలుగు సలుగెరిగిన పని==
నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని,ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/748310" నుండి వెలికితీశారు