రుక్మిణీ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==పోతన భాగవతంలోని పద్యాలు==
వలచిన శ్రీకృష్ణుని రుక్మిణి ఇలా భావించినది.
 
ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
 
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల?
 
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల?
 
దయత! నీయధరామృతంబానగాలేని
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
 
 
నీరజాతనయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
 
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?
 
 
రుక్మిణి తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి మనస్సు పలుపలు విధాలుగా అలోచిస్తూ, చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.
 
"https://te.wikipedia.org/wiki/రుక్మిణీ_కళ్యాణం" నుండి వెలికితీశారు