ఛందస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

13:31, 4 ఆగస్టు 2005 నాటి కూర్పు

గురువులు, లఘువులు

===గురువు, లఘువు, విభజించడము=== ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయం పై ఆధార పడి ఉంటుంది, ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము " అమ్మ " ఇందు మొదటి పదము రెండు లిప్తల కాలము ఆ తరువాతి మ్మ ఒక లిప్త కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, ల లు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అందురు.

=== గుర్తులు/ సంజ్ఞలు === గురుగుని U తోటీ, లఘువుని I తోటీ సూచిస్తారు

కొన్ని నియమాలు

  1. ధీర్గాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
  2. ఋ పొల్లులు (కృ , మొదలగున్నవి ) లఘువులు మాత్రమే
  3. ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సంధర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమ లో స గురువు, దీనికి అభ్యాసము పై తెలుసుకొనవచ్చు.
  4. ఒక సున్నా, రెండు సున్నాలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడి లో సం గురువు, అంత:పురము లో త: అనునది గురువు )

==గణాలు== గణాలు అనగా, రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాల గురు లఘు నిర్ణయాన్ని బట్టి వాటిని ఏదో ఒక గ్రూపు లో ఉంచుతారు, దీనినే ఏదో ఒక గణము అని అంటారు. ===రెండక్షరాల గణాలు=== మొత్తము ఉన్నవి రెండు రకాల అక్షరాలు గురువు, లఘువు; రెండక్షరాల గణాలు మొత్తము నాలుగు వస్తాయి (బైనరీ 0, 1 కాంబినేషన్లు తీసుకున్న 00, 01, 10, 11 వచ్చినట్లు) ఆ నాలుగు రెండక్షరాల గణాలు

  1. లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
  2. లగ IU ఉదా: రమా
  3. గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
  4. గగ UU ఉదా: రంరం, సంతాన్

===మూడక్షరాల గణాలు=== ఇవి మూడక్షరాల కాంబినేషన్లతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111)

ఇవి తేలిక గా గుర్తు ఉంచుకోవడానికి చిన్నప్పుడు ఒక వరస లో గుర్తు ఉంచు కున్నాము, ఇప్పుడు అదే వరుస లో రాస్తున్నాను భ జ స న య ర త మ అనగా

  1. ఆది గురువు భ గణము (UII)
  2. మధ్య గురువు జ గణము (IUI)
  3. చివరి గురువు స గణము (IIU)
  4. సర్వ లఘువులు న గణము (III)
  5. ఆది లఘువు య గణము (IUU)
  6. మధ్య లఘువు ర గణము (UIU)
  7. చివరి లఘువు త గణము (UUI)
  8. సర్వ గురువులు మ గణము (UUU)

అంతే నండి, ఇవే మూడక్షరముల గణములు

ఉపగణాలు

ఉప గణములు అనగా పై వాటి కాంబినేషన్ల లో ఏర్పడేవి ఇవి మూడు రకములు

సూర్య గణములు

న = న = III హ = గల = UI

ఇంద్ర గణములు

  1. నగ = న + గ = III + U = IIIU

ఈ క్రిందివి కూడా అలాగే

  1. సల
  2. నల

చంద్ర గణములు

  1. భల
  2. భగరు
  3. తల
  4. తగ
  5. మలఘ
  6. నలల
  7. నగగ
  8. నవ
  9. సహ
  10. సవ
  11. సల
  12. సగగ
  13. నహ
  14. రగురు
  15. నల

పద్య లక్షణాలు

వృత్తాలు

గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృతాలు. ఇందు చాలా రకాలు కలవు, వాటిని క్రింద విడివిడిగా తెలుసుకుందాము

  1. చంపకమాల
  2. ఉత్పలమాల
  3. శార్దూలవిక్రీడితము
  4. మత్తేభ విక్రీడితము
  5. తరళం
  6. తరలము
  7. తరలి
  8. మాలిని
  9. మత్తకోకిల


జాతులు

జాతులు మాత్రాగణములతో మఱియు ఉపగణములతో శోభిల్లును

  1. కందం
  2. ద్విపద
  3. తరువోజ

ఉప జాతులు

  1. తేటగీతి
  2. ఆటవెలది
  3. సీసము

చూడండి

  1. సాహిత్యము
  2. అలంకారములు
"https://te.wikipedia.org/w/index.php?title=ఛందస్సు&oldid=7515" నుండి వెలికితీశారు