హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
'''మొదటి సాహసం:''' హెరాకిల్స్ ను నెమియా వెళ్ళి అక్కడ ఉన్న రాక్షస సింహాన్ని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. చెప్పినట్టుగా హెరాకిల్స్ నెమియా వెళ్ళి అక్కడున్న రాక్షస సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ సింహాన్ని కత్తి, బాణము, గదతో ఎదుర్కోలేకపోతాడు. చివరికి చేసేది లేక వట్టి చేతులతోనే పోరాడి పీకను నులిమి చంపేస్తాడు. గదతో దాని దంతాలను రాలగొట్టి, ఒక దంతంతో దాని చర్మాన్ని చీల్చి ఆ చర్మాన్ని వస్త్రంగా చేసుకుంటాడు. ఈ విషయంలో ఎధినా అనే దేవత ఒక ముదుసలి స్త్రీ రూపంలో వచ్చి హెరాకిల్స్ కు సాయం చేస్తుంది.
 
'''రెండవ సాహసం:''' హెరాకిల్స్ ను 5 నుండి 100 తలలు గల విష సర్పాన్ని చంపమంటాడు యురిస్తియోస్. లెర్నా అనే నది వద్ద నివసించే ఈ సర్పానికి ఒక తల తెగిన చోట రెండు తలలు పుట్టుకొస్తాయి. తన మేనల్లుడైన లోలాస్ సహాయంతో రసాయనం పూసిన కాగడాతో తలలు పుట్టుకు రాకుండా చేసి, అన్ని తలలు నరికివేసి ఆ సర్పాన్ని చంపేస్తాడు. తన బాణాలను ఆ సర్ప శరీరంలొకి గుచ్చి మరింత విషమయం చేసుకుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ బాణాలే హెరాకిల్స్ మరణానికి దారితీస్తాయి.
 
'''మూడవ సాహసం:''' హెరాకిల్స్ ను ఎరిమాన్తియన్ పర్వతంలో రాకాసి పందిని సజీవంగా తీసుకురమ్మంటాడు యురిస్తియోస్. హెరాకిల్స్ దారిలో తన మిత్రుడైన 'ఫోలస్' వద్దకు వెళ్ళతాడు. ఫోలస్ ఒక కిన్నెరుడు. హెరాకిల్స్ కు మిత్రుడైన ఫోలస్ అతిధి మర్యాదలు చేస్తాడు. తిన్న తర్వాత హెరాకిల్స్ త్రాగడానికి ద్రాక్షారసం అడుగగా వ్యవసాయం, ద్రాక్షారసానికి, సారవంత ప్రకృతికి దేవుడైన డయోనిసస్ కిన్నెరులందరికీ ఒక్క సీసా మాత్రమే బహూకరించాడని ఫోలస్ చెబుతాడు. హెరాకిల్స్ చెప్పగా ఫోలస్ ద్రాక్షరస కూజా మూత తీస్తాడు. ద్రాక్షారస వాసన అడవులగూండా ప్రయాణించి ఇతర కిన్నెరులకు తాకుతుంది. అది గమనించి వారు హెరాకిల్స్ పై దాడి చేస్తారు. హెరాకిల్స్ తన బాణాలను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించిన కిన్నెరులందరినీ తన గురువైన చిరాన్ దేవుడి వద్దకు తరిమేస్తాడు. పొరపాటున ఒక బాణం చిరాన్ కు తగులుతుంది. ఆ బాణాలు లెర్నా నదివద్ద సర్పవిషంలో ముంచినవి కావడంతో చిరాన్ మరణిస్తాడు. ఆ బాణాల తాకిడి వల్ల ఫోలస్ కూడా మరణిస్తాడు. విచారంతో హెరాకిల్స్ రాకాసి పంది వేటకు బయల్దేరతాడు. ఆ పందిని మంచుకొండల గూండా అలసిపోయే వరకూ తరిముతాడు. ప్రమాదవశాత్తు ఆ పంది మంచులో చిక్కుకుపోగా హెరాకిల్స్ దాన్ని పట్టి కాళ్ళు కట్టి, తన భజాలకు తగిలించుకొని యురిస్తియోస్ వద్దకు వెళ్ళతాడు. రాకాసి పందిని చూసిన యురిస్తియోస్ భయంతో పెద్ద జాడీలో పెట్టేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు