హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
'''రెండవ సాహసం:''' హెరాకిల్స్ ను 5 నుండి 100 తలలు గల విష సర్పాన్ని చంపమంటాడు యురిస్తియోస్. లెర్నా అనే నది వద్ద నివసించే ఈ సర్పానికి ఒక తల తెగిన చోట రెండు తలలు పుట్టుకొస్తాయి. తన మేనల్లుడైన లోలాస్ సహాయంతో రసాయనం పూసిన కాగడాతో తలలు పుట్టుకు రాకుండా చేసి, అన్ని తలలు నరికివేసి ఆ సర్పాన్ని చంపేస్తాడు. తన బాణాలను ఆ సర్ప శరీరంలొకి గుచ్చి మరింత విషమయం చేసుకుంటాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ బాణాలే హెరాకిల్స్ మరణానికి దారితీస్తాయి.
 
'''మూడవ సాహసం:''' హెరాకిల్స్ ను ఎరిమాన్తియన్ పర్వతంలో రాకాసి పందిని సజీవంగా తీసుకురమ్మంటాడు యురిస్తియోస్. హెరాకిల్స్ దారిలో తన మిత్రుడైన 'ఫోలస్' వద్దకు వెళ్ళతాడు. ఫోలస్ ఒక కిన్నెరుడు. హెరాకిల్స్ కు మిత్రుడైన ఫోలస్ అతిధి మర్యాదలు చేస్తాడు. తిన్న తర్వాత హెరాకిల్స్ త్రాగడానికి ద్రాక్షారసం అడుగగా వ్యవసాయం, ద్రాక్షారసానికి, సారవంత ప్రకృతికి దేవుడైన డయోనిసస్ కిన్నెరులందరికీ ఒక్క సీసా మాత్రమే బహూకరించాడని ఫోలస్ చెబుతాడు. హెరాకిల్స్ చెప్పగా ఫోలస్ ద్రాక్షరస కూజా మూత తీస్తాడు. ద్రాక్షారస వాసన అడవులగూండా ప్రయాణించి ఇతర కిన్నెరులకు తాకుతుంది. అది గమనించి వారు హెరాకిల్స్ పై దాడి చేస్తారు. హెరాకిల్స్ తన బాణాలను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించిన కిన్నెరులందరినీ తన గురువైన చిరాన్ దేవుడి వద్దకు తరిమేస్తాడు. పొరపాటున ఒక బాణం చిరాన్ కు తగులుతుంది. ఆ బాణాలు లెర్నా నదివద్ద సర్పవిషంలో ముంచినవి కావడంతో చిరాన్ మరణిస్తాడు. ఆ బాణాల తాకిడి వల్ల ఫోలస్ కూడా మరణిస్తాడు. విచారంతో హెరాకిల్స్ రాకాసి పంది వేటకు బయల్దేరతాడు. ఆ పందిని మంచుకొండల గూండా అలసిపోయే వరకూ తరిముతాడు. ప్రమాదవశాత్తు ఆ పంది మంచులో చిక్కుకుపోగా హెరాకిల్స్ దాన్ని పట్టి కాళ్ళు కట్టి, తన భజాలకు తగిలించుకొని యురిస్తియోస్ వద్దకు వెళ్ళతాడు. రాకాసి పందిని చూసిన యురిస్తియోస్ భయంతో పెద్ద జాడీలో పెట్టేస్తాడు.
 
'''నాల్గవ సాహసం:''' ఈ సాహసంలో ఆర్టిమిస్ అనే కన్యక దేవతకు ప్రీతికరమైన జింకను హెరాకిల్స్ బంధిస్తాడు. సెర్నియా అను ప్రదేశంలో నివసించే ఈ జింక కాంస్య, బంగారపు గిట్టలు కలిగివుండి గాలిలో వదిలిన బాణ వేగాన్ని సైతం అధికమిస్తుంది. హెరాకిల్స్ సంవత్సరం పాటూ శ్రమించి ఆ జింకను ఓ నది దాటుతుండగా బాణంతో కొట్టి పట్టుకుని తన భుజంపై వేసుకుంటాడు. ఆర్టిమిస్ కు గతాన్ని అంతా చెబుతాడు. హెరాకిల్స్ ఆ జింకను తీసుకెళ్ళి యొరిస్తియోస్ కు చూపిస్తాడు. మాట ప్రకారం హెరాకిల్స్ ఆ జింకను ఆర్టిమిస్ కు సజీవంగా తిరిగి ఇచ్చేస్తాడు.
 
'''ఐదవ సాహసం:''' ఎలిస్ దేశపు రాజైన ఆగీస్ కి ఒక 30 సంవత్సరాల నుండి శుభ్రం చేయబడని అశ్వశాల ఉంది. ఈ అశ్వశాలను ఒక్క రోజులో శుభ్రపరచడమే హెరాకిల్స్ చేసిన ఐదవ సాహసం. అశ్వశాలలో రెండు వైపుల గోడలను పడగొట్టి కందకాలు తవ్వి ఆఫయుస్, పెయుస్ అనే రెండు నదుల ప్రవాహాలను మళ్ళించాడు. అంతే అవి శుభ్రమైపోయాయి. పదవ వంతు అశ్వాలను ఇస్తానని మాట తప్పిన అగీస్ ను హెరాకిల్స్ హతమార్చుతాడు. తన పని సహాయపడినందుకుగాను అగిస్ కుమారుడైన ఫైలియూస్ కు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు.
 
[[వర్గం:గ్రీకు పురాణం]]
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు