హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==కధ==
హెరాకిల్స్ ను సవతి తల్లి అయిన హెరా హెరాకిల్స్ ను ద్వేషిస్తుంది. హెరికిల్స్ ను చంపడానికి రెండు సర్పాలను పంపగా వాటిని తన బలంతో చంపేస్తాడు. ఆ విధంగా చిన్ననాటినుండి అత్యంత బలవంతుడిగా పెరుగుతాడు హెరాకిల్స్. యుక్త వయసులో మెగారా అనే యువతిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు హెరాకిల్స్. ఇది సహించలేక హెరా తన మాయతో హెరాకిల్స్ కు కోపం వచ్చేలా చేస్తుంది. ఆ కోపంలో హెరాకిల్స్ విచక్షణ కోల్పోయి తన భార్యా బిడ్డలను కిరాతకంగా చంపేస్తాడు.చేసిన పాపానికి పశ్చాత్తాపంతో హెరాకిల్స్ 'డెల్ఫీ' అనే గ్రామానికి వెళ్ళి అక్కడ 'అపోలో' అనే దైవాన్ని కలుస్తాడు. ఎరిస్తియోస్ అనే ఆర్గాస్ సామ్రాజ్యపు రాజు చెప్పినట్లుగా పన్నెండు సాహస కృత్యాలను చేస్తే చేసిన పాపాన్ని దేవుళ్ళు క్షమిస్తారని అపోలో చెబుతాడు. హెరాకిల్స్ ను ముందుగా 10 సాహసాలు చేయమంటాడు యురిస్తియోస్.
 
'''మొదటి సాహసం:''' హెరాకిల్స్ ను నెమియా వెళ్ళి అక్కడ ఉన్న రాక్షస సింహాన్ని సంహరించమని ఆజ్ఞాపిస్తాడు. చెప్పినట్టుగా హెరాకిల్స్ నెమియా వెళ్ళి అక్కడున్న రాక్షస సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ సింహాన్ని కత్తి, బాణము, గదతో ఎదుర్కోలేకపోతాడు. చివరికి చేసేది లేక వట్టి చేతులతోనే పోరాడి పీకను నులిమి చంపేస్తాడు. గదతో దాని దంతాలను రాలగొట్టి, ఒక దంతంతో దాని చర్మాన్ని చీల్చి ఆ చర్మాన్ని వస్త్రంగా చేసుకుంటాడు. ఈ విషయంలో ఎధినా అనే దేవత ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి హెరాకిల్స్ కు సాయం చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు