హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
'''పదవ సాహసం:''' హెరాకిల్స్ పదవ సాహసం గెర్యాన్ అను రాక్షసుడికి చెందిన పశు సంపదను సాధించడం. యురిథియా సామ్రాజ్య రాజైన గెర్యాన్ అను రాక్షసుడు మూడు జతల కాళ్ళు, మూడు మొండెములు కలిగినవాడు. హెరాకిల్స్ లిబియా ఎడారి మీదుగా యురిథియా వెళ్తున్నప్పుడు హీలియోస్ అను సూర్య భగవానుడి వద్ద నుండి బంగారు కప్పుని పొంది దాని సహాయంతో యురిథియా చేరతాడు. అబాస్ పర్వత శిఖరం వద్ద హెరాకిల్స్ తన గదను ఉపయోగించి గెర్యాన్ కాపరి అయిన యురిషన్ ను, ఓర్తస్ అను రెండు తలల కుక్కను హతమారుస్తాడు. ఇదంతా కళ్ళారా చూసిన మెనొటెస్ అను నరకానికి చెందిన కాపరి గెర్యాన్ కు వివరిస్తాడు. చివరిగా అంధిమస్ నది వద్ద హెరాకిల్స్ గెర్యాన్ ను హతమారుస్తాడు.
 
'''పదవ సాహసం:''' హెస్పెరిడెస్ అను దేవకన్యలు కాపలా కాస్తున్న తోటలోనుండి బంగారు యాపిల్స్ ను దొంగిలించడం హెరాకిల్స్ చేసిన పదవ సాహసం. హెరాకు పెళ్ళి బహుమతిగా గేయా దేవత ఇచ్చిన బంగారు యాపిల్స్ కాసే చెట్లను హెస్పెరెడిస్ అను దేవకన్యలు కాపలా కాస్తుంటారు. ఈ దేవకన్యలు అట్లాస్ కుమార్తెలు. ఈ యాపిల్స్ ను దొంగిలించడమే హెరాకిల్స్ చేయవలసిన పదకొండవ సాహసం. హెరాకిల్స్ తన ప్రయాణంలో కకాకస్ పర్వతాల వద్ద జూస్ చే శపించబడిన ప్రొమిధియస్ యొక్క కాలేయాన్ని ఆరగిస్తున్న ఒక గ్రద్ధను సంహరిస్తాడు. హెరాకిల్స్ ను భూమిని చేతులతో మోసే అట్లాస్ దేవుడి వద్దకు వెళ్ళమంటాడు ప్రొమిధియస్. హెరాకిల్స్ అట్లాస్ వద్దకు వెళ్ళతాడు. అట్లాస్ బంగారపు యాపిల్స్ ను తీసుకొస్తే ఆలోగా భూమిని మోస్తానంటాడు హెరాకిల్స్. జాస్ పెట్టిన శిక్షనుండి తప్పించుకోవడానికి అదే అవకాశంగా భావించిన అట్లాస్ హెరాకిల్స్ కోసం యాపిల్స్ తీసుకురావడానికి ఒప్పుకుంటాడు. అట్లాస్ బంగారు ఆపిల్ పండ్లను తీసుకొస్తాడు. హెరాకిల్స్ "భూమిని మోస్తుంటే భుజం నొప్పిగా ఉంది. ఒక్క సారి ఈ భూమిని పట్టుకుంటే , నొప్పి లేకుండా నేను నా భుజంపై సింహపు తోలు ను మెత్తటి దిండులా పెట్టుకుంటాను" అనడంతో అట్లాస్ ఆ భూమినిపట్టుకుంటాడు. హెరాకిల్స్ ఆ విధంగా అట్లాస్ ను బురిడీ కొట్టి ఆపిల్స్ సంపాదించాడు. తరువాత ఆపిల్స్ ను యురిస్తియోస్ వద్దకు తీసుకెళ్ళాడు.
 
[[వర్గం:గ్రీకు పురాణం]]
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు