వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 13వ వారం: కూర్పుల మధ్య తేడాలు

చి
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
[[ఫైలు:AllUri sItaaraamaraajuAlluri_Sita_Rama_Raju_statue.jpg|right|100px]]'''అల్లూరి సీతారామరాజు''' జరిపిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామ రాజు [[1897]] [[జూలై 4]]న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. భీమవరంలో మిషన్ హైస్కూలులో, [[తూర్పు గోదావరి]] జిల్లా [[రామచంద్రాపురం]]లో, [[కాకినాడ]] పిఠాపురం రాజా పాఠశాలలో, [[విశాఖపట్నం]]లో, [[నర్సాపురం]]లో ఇతని చదువు సాగింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలో ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. [[ధారకొండ]], [[కృష్ణదేవి పేట]] మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. [[జ్యోతిష్యం]], [[వాస్తు శాస్త్రం]], [[హఠయోగం]], [[కవిత్వం]] [[సంస్కృతం]], [[ఆయుర్వేదం]] నేర్చుకున్నాడు.
 
 
5,825

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754118" నుండి వెలికితీశారు