పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==వృత్తి జీవితం==
లా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత 1992లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993లో హైదరాబాద్ లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పధ్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ హెచ్.ఎం.టి.విలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ప్రస్తుతం హెచ్.ఎం.టి.విలో బాధ్యతాయుతమైన హోదాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీసిక్స్ న్యూస్ ఛానెల్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. విశిష్ట కథనాలు అందిస్తూ వీసిక్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
[[అనేక వచనం]] కవితా సంపుటి తరువాత రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో వెలుగు చూడాల్సి ఉంది. అనేక వచనంలోని కవితలు, ఆ తరువాత రాసిన కవితలన్నీ <ref>[www.anekavachanam.wordpress.com బ్లాగులో]</ref> ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. కవిత్వాభిమానుల ఆదరణతో ఈ బ్లాగు ఆరు నెలల వయసు కూడా రాక ముందే పదివేల హిట్లతో దూసుకుపోతోంది.