సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు. [[ఆనందభైరవి]], [[రెందు జళ్ల సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందారు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చారు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు , ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నారు.
 
వీరు తమ స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయారు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారు. [[ఆనందోబ్రహ్మ]], మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు వీరికి మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు