"కొండా లక్ష్మణ్ బాపూజీ" కూర్పుల మధ్య తేడాలు

 
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబరు 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించాడు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక వీద్యాభ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశాడు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టాడు.
 
==స్వాతంత్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవాడు.<ref>చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291</ref> 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. 1948లో విమోచనోద్యమంలో పోరాడినాడు. నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృదంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే. ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/759913" నుండి వెలికితీశారు