ప్రధాన మెనూను తెరువు

మార్పులు

 
==స్వాతంత్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవాడు.<ref>చిరస్మరణీయులు, పి.వి.బ్రహ్మ, ప్రచురణ 2009, పేజీ 291</ref> 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. 1948లో విమోచనోద్యమంలో పోరాడినాడు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృదంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే.<ref>స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచయిత మల్లయ్య</ref> ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నాడు.
 
==రాజకీయ జీవితం==
1957లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనాడు. అప్పుడే శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/759914" నుండి వెలికితీశారు