ఒమర్ ఖయ్యాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
 
మొదట బోడ్లియన్ లైబ్రరిలో వున్న ఖయ్యాము రుబాయూతులను గూర్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకుడుగా వున్న ఇ.బి.కోవెల్ క్రీ.శ.1856 లో గుర్తించాడు.ఆయన దానిని గురించి 1858 లో 'కలకత్తా రెవ్యూ'లో ఒక వ్యాసంలో ప్రకటించెను.ఆ మరుసటి సంవత్సరము ఎడ్వర్డు ఫీ'ట్జెరాల్డ్ ,75 రుబాయుతులను ఇంగ్లీషులోకి తర్జుమా చేసెను.క్రీ.శ.1867 లో పారశీక రాజాస్ధానమున ఫ్రెంచి రాయబారికి దుబాసి/ద్విభాషి గా వున్న జె.బి.నికొల రుబాయూలను ఫ్రెంచి భాషలోకి అనువాదం చేసాడు.ఆ తరువాత సంవత్సరంలో ఫే 'ట్ జెరాల్డ్ ఇంకొన్ని రుబాయూలను చేర్చి 101 రుబాయూలున్న పుస్తకాన్ని ముద్రించెను.
 
ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను.ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫి'క్ అను గురువు వద్ద జరిగినది.ఖయ్యాముకు, '''నిజాముల్ ముల్కు ''' సహపాఠి,మిత్రుడు.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు.అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు.నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు,నీతివేత్త.ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్టలకు చిరంజీవం కావించెను.అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను.నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా,తమ పూర్వ స్నేహాన్ని మరవక,ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా,ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని,శాస్త్రాద్యాయము చేయుచు,గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు భోదన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను.అంతట పాదుషాకు చెప్పి సంవత్సరంకు 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.
 
== సంస్మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ఖయ్యాం" నుండి వెలికితీశారు