మురారిరావు ఘోర్పడే: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మురారిరావు'''గా పేరొందిన మురారిరావు ఘోర్పాడే మరాఠా సర్దారు, ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మురారిరావు'''గా పేరొందిన '''మురారిరావు ఘోర్పాడే''' మరాఠా సర్దారు, సేనాని. 18వ శతాబ్దపు దక్కన్ చరిత్రలో ప్రముఖ చారిత్రక వ్యక్తి. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పాడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=2MwNAAAAIAAJ&pg=PA101&lpg=PA101#v=onepage&q&f=false A collection of treaties, engagements, and sanads relating to ..., Volume 8 By India. Foreign and Political Dept]</ref>
 
తిరుచ్చి కోటపై దాడిచేసిన నిజాం ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారి రావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.
 
[[గుత్తి]] దుర్గాన్ని పాలిస్తూ 1756లో పీష్వా [[బాలాజీ బాజీరావు]]కు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో [[నిజాం]]కు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు. మురారిరావు [[తిరుచిరాపల్లి]] ముట్టడిలో ఫ్రెంచి వారికి సహాయం చేశాడు. ఆ సహాయానికి గానూ ఫ్రెంచివారు మురారిరావుకు పద్నాలుగు లక్షలు బాకీ పడ్డారు. కానీ కర్నాటకంలో కలిసిరాక, వర్తకం దెబ్బతిని మురారిరావు బాకీ చెల్లించలేకపోయారు. అందుకే తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో బుస్సీ, తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, సలాబత్ జంగుకు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక మురారిరావుపై నిజాం, పీష్వాలతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మురారిరావు_ఘోర్పడే" నుండి వెలికితీశారు