మురారిరావు ఘోర్పడే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మురారిరావు'''గా పేరొందిన '''మురారిరావు ఘోర్పాడే''' మరాఠా సర్దారు, సందూరు రాజు. 18వ శతాబ్దపు దక్కన్ చరిత్రలో ప్రముఖ చారిత్రక వ్యక్తి. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పాడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=2MwNAAAAIAAJ&pg=PA101&lpg=PA101#v=onepage&q&f=false A collection of treaties, engagements, and sanads relating to ..., Volume 8 By India. Foreign and Political Dept]</ref>
 
1741 నుండి 1743వరకు రెండు సంవత్సరాలు తిరుచిరాపల్లి ప్రాంతాన్ని పాలించాడు. 1741లో రాఘోజీ భోసాలే, ఫతే సింగ్ మరియు మురారిరావుల నేతృత్వంలో పెద్ద మరాఠా సైన్యంతో ఆర్కాటుని కైవసం చేసుకొని, తిరుచ్చి కోటను ముట్టడిచేసి, అక్కడ జరిగిన యుద్ధంలో కర్నాట నవాబు దోస్త్ అలీఖాన్ అల్లుడు చందా సాహిబ్ ను ఓడించి, బందీగా సతారాకు తీసుకొనివెళ్లారు. తిరుచ్చి కోటను పాలించడానికి మురారిరావును నియమించారు. కానీ కోటపై ఆయన వెంటనే పట్టుకోల్పోయాడు. 1743లో తిరుచ్చి కోటపై దాడిచేసిన నిజాం[[నిజాముల్ ముల్క్]] ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారి రావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.
 
[[గుత్తి]] దుర్గాన్ని పాలిస్తూ 1756లో పీష్వా [[బాలాజీ బాజీరావు]]కు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో [[నిజాం]]కు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=9Fb26pWqhScC&pg=PA90&lpg=PA90&dq=murari+rao#v=onepage&q=murari%20rao&f=false Nizam-British Relations, 1724-1857 By Sarojini Regani]</ref> మురారిరావు [[తిరుచిరాపల్లి]] ముట్టడిలో ఫ్రెంచి వారికి సహాయం చేశాడు. ఆ సహాయానికి గానూ ఫ్రెంచివారు మురారిరావుకు పద్నాలుగు లక్షలు బాకీ పడ్డారు. కానీ కర్నాటకంలో కలిసిరాక, వర్తకం దెబ్బతిని మురారిరావు బాకీ చెల్లించలేకపోయారు. అందుకే తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో బుస్సీ, తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, సలాబత్ జంగుకు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక మురారిరావుపై నిజాం, పీష్వాలతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
 
మరాఠులు పొరుగురాజ్యమైన మైసూరుతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. హైదర్ అలీ ప్రాబల్యం పెరిగిపోతుందని గ్రహించిన పీష్వా మాధవరావు మురారిరావు సహాయంతో మైసూరుపై దండెత్తాడు. ఈ దండయాత్ర 1764 నుండి 1765 జూన్ వరకు కొనసాగింది. యుద్ధంలో గెలవలేక హైదర్‌అలీ పీష్వాతో సంధి చేసుకోని 28లక్షలు కప్పం చెల్లించాడు. తిరిగి 1770లో మాధవరావు శ్రీరంగపట్నానికి చేరుకున్నప్పుడు 40 లక్షలు కప్పం చెల్లిస్తానని సంధి చేసుకున్నాడు.
మురారి రావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు. 1775లో [[హైదర్ అలీ]] బళ్ళారి పతనం తర్వాత గుత్తిపై దండెత్తి మురారి రావును బంధించి కబ్బలదుర్గ్‌లో బందీగా ఉంచాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మురారిరావు అక్కడ కారాగారంలోనే మరణించాడు. గుత్తితో పాటు సందూరు రాజ్యాన్ని మొత్తం హైదర్ అలీ తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.<ref>[http://books.google.com/books?id=xndDAAAAYAAJ&pg=PA43&lpg=PA43&dq=morari+rao+ghorpade#v=onepage&q=morari%20rao%20ghorpade&f=false Imperial Gazetteer of India By Sir William Wilson Hunter]</ref>
 
మురారి రావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు. 1775లో1775 డిసెంబర్లో [[హైదర్ అలీ]] బళ్ళారిబళ్ళారిని పతనంకైవసం తర్వాతచేసుకొని గుత్తిపై ముట్టడి చేశాడు. 1776, జనవరి 10న గుత్తి దుర్గంపై దండెత్తి మురారి రావును బంధించి కబ్బలదుర్గ్‌లోతొలుత శ్రీరంగపట్నంలోనూ, ఆ తర్వాత కబ్బాలదుర్గ్‌లో బందీగా ఉంచాడు.<ref>[http://books.google.com/books?id=_7QIAAAAQAAJ&pg=PA23&lpg=PA23&dq=murarirao#v=onepage&q=murarirao&f=false Memoirs of Hyder and Tippoo: rulers of Seringapatam, written in the Mahratta ...By Ram Chandra Rao Punganuri]</ref> ఆ తర్వాత కొన్నాళ్ళకే మురారిరావు అక్కడ కారాగారంలోనే మరణించాడు. గుత్తితో పాటు సందూరు రాజ్యాన్ని మొత్తం హైదర్ అలీ తన సామ్రాజ్యంలో కలుపుకొన్నాడు.<ref>[http://books.google.com/books?id=xndDAAAAYAAJ&pg=PA43&lpg=PA43&dq=morari+rao+ghorpade#v=onepage&q=morari%20rao%20ghorpade&f=false Imperial Gazetteer of India By Sir William Wilson Hunter]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:17761777 మరణాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[en:Murari Rao]]
"https://te.wikipedia.org/wiki/మురారిరావు_ఘోర్పడే" నుండి వెలికితీశారు