ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
కృష్ణారావు పతంజలి సెక్రెటరి.తూ.గో.జిల్లా.ఐనవరం మండలం కు చెందిన,మారు మూల గ్రామం గంధంవారి పాలెం కు చెందిన ఎస్.ఎస్.నారాయణరావుకు పతాంజలి అంటే వీరాభిమానం.పట్టు వీడక వుత్తరాలు రాసేవాడు. కృష్ణారావు ఎలాగోలా పతంజలిని ఒప్పించి ప్రత్యుత్తరం ఇప్పిస్తాడు.ఆవుత్తరం చూసిన గంధంవారి పాలెం ప్రజలు అబ్బురపడి,అందరు ముకుమ్మడిగా రాజమండ్రి వెళ్ళి,ఆయన తీసిన సినిమా చూసి,వూరంతా ఆయన అభిమానులై పోయి,పతంజలికి తమగ్రామంలో సన్మానం చేయాలని తీర్మానించి,ఆ అభ్యర్థనను,నారాయణరావు వుత్తరంద్వారా తెలియపర్చారు.వీలాంటి వాటికి దూరంగా వుండే పతంజలి మొదట నిరాకరించినప్పటికి,కృష్ణారావు బలవంతం మీద ఒప్పుకుంటాడు.గంధంవారిపాలెం కు నేరుగా రవాణా సౌకర్యం లేదు.రాజమండ్రి వరకు ఎక్సుప్రెసు రైలులో వచ్చి,అక్కడినుండి బలభద్రపురం వరకు ప్యాసింజరు రైలులో,అక్కడినుండిరాజానగరంవెళ్ళెబస్సులో కొంతదూరం వెళ్ళి,అక్కడినుండి మూడుమైళ్ళు మట్టిరోడ్దులో ప్రయాణిస్తేకాని గంధంవారి పాలెం చేరలేము.రాజమండ్రినుండి ఎర్రబస్సు దిగే వరకు పతంజలి ప్రయాణం అసౌకర్యంగా,అపరిశుభ్ర పరసరాలచుట్టు జరిగింది.ఇవన్ని చూసాకా పతంజలికి ''పరిశుభ్రత,భావుకత''విషయంలో తనకు మొదటినుండి వున్న అభిప్రాయమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేశాడు.బస్సు దిగిన తరువాత గంధం వారిపాలెం కు వెళ్ళటానికి ఎటు వంటి ఆటోలు,టాక్సీలు లేవు.ఒక రిక్షా తప్ప.
 
''చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయికాళ్ళు,చలువ చేయించి కట్టుకొన్న ఖాకీ నిక్కారూ మోచేతుల దాకా మడచిపెట్టిన రంగు వెలసిన గళ్లచొక్కా,నున్నగా గీసుకున్న గడ్డం,నూనె రాసుకుని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాఫ్‍తో వున్నాడు రిక్షావాడు.పేరు గోపాలం.బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి శిరిపాదం వరకూ పరిశీలించి చూచిన పతంజలికి ఎంత స్వచ్చంగా వున్నాడీ మనిషి అనిపించింది''.రిక్షాలో ముందు రెండు పెద్ద సూట్‍కేసులుండటం వలన,కాళ్ళు పెట్టుకొనుటకు ఇబ్బందిగా వుండటంతో,కాలినడకనే వెళ్ళుట మేలని ఎంచి,లగేజితో వున్న రిక్షాను ముందువెళ్ళమంటారు.రిక్షా వాళ్లను క్రాస్ చేసుకు వెళ్లుండగా,రిక్షా సైన్ బోర్డు పై రాసిన వాక్యం చదువుతాడు పతంజలి.
 
'''ఆనాటి వాన చినుకులు.'''
 
''"ప్రాణమున్న శిల్పంలా నిలబడి పోయాడు పతంజలి....ఆ భాషలో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి.ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆవాన చినుకులు.ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆవాక్యాలు.ఏ ఉర్వశి నిర్ధయతో నిందింస్తే నిర్మింపబడ్దయో ఆవాన చినుకులు.ప్రకృతి పరవశించినప్పుడా?విరహం వికటించినప్పుడా?గజ్జెలు కట్టిన లేగదూడ ఘలం ఘలించినప్పుడా?
 
ఆనాటి వానచినుకులు-ఎన్ని అర్ధాలు నిక్షిప్తమైఉన్నాయి ఆ వాక్యంలో.ఎంతమంది బైరన్‍లూ,కృష్ణశాస్ర్తులూ దాక్కుని ఉనారు ఆ వాక్యంలో....ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లోంచి వెచ్చగా వెలుపకొచ్చిందా వాక్యం.
 
ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏవీ చదవక్కరలేదు.ఏదీ వినక్కరలేదు.భావుకుడు తయారుకాడు.జన్మిస్తాడు.మనిషిలో స్పందన.ప్రకృతిలో ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం.''
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు