మురారిరావు ఘోర్పడే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
మురారిరావు 1699 ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పాడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=2MwNAAAAIAAJ&pg=PA101&lpg=PA101#v=onepage&q&f=false A collection of treaties, engagements, and sanads relating to ..., Volume 8 By India. Foreign and Political Dept]</ref> మురారి రావు తండ్రి మరణం తర్వాత 1731లో రాజయ్యాడు. 1729 జూన్లో మొదటి భార్య సగుణాబాయిని వివాహం చేసుకున్నాడు. ఈయన రెండవ భార్య పేరు తెలియలేదు. కానీ ఆమె 1791లో, శ్రీరంగపట్నంలో టిప్పూసుల్తాను అదేశంపై చంపబడిందని తెలుస్తున్నది. <ref>http://www.royalark.net/India2/sandur3.htm</ref> మురారి రావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో, చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు.
1741లో రాఘోజీ భోసాలే, ఫతే సింగ్ మరియు మురారిరావుల నేతృత్వంలో పెద్ద మరాఠా సైన్యంతో ఆర్కాటుని కైవసం చేసుకొని, తిరుచ్చి కోటను ముట్టడిచేసి, అక్కడ జరిగిన యుద్ధంలో కర్నాట నవాబు దోస్త్ అలీఖాన్ అల్లుడు చందా సాహిబ్ ను ఓడించి, బందీగా సతారాకు తీసుకొనివెళ్లారు. తిరుచ్చి కోటను పాలించడానికి మురారిరావును నియమించారు. 1741 నుండి 1743వరకు రెండు సంవత్సరాలు మురారిరావు తిరుచిరాపల్లి ప్రాంతాన్ని పాలించాడు. 1743లో తిరుచ్చిఆర్కాట్లో కోటపైవారసత్వ తగువుని దాడిచేసినతీర్చి, [[నిజాముల్ ముల్క్]] తిరుచ్చి కోటపై దాడి చేసి, ఆరు నెలల పాటు ముట్టడి కొనసాగించాడు. బాలాజీ బాజీరావు, రఘూజీ పరస్పర యుద్ధంలో ఉండటం వల్ల మహరాష్ట్ర నుండి సహాయం అందే సూచనలు లేక, చివరికి మురారిరావు నిజాంతో ఒప్పందం కుదుర్చుకొని కోటను వశం చేశాడు. ప్రతిగా నిజాం మురారి రావుకు రెండు లక్షల బహుమానంతో పాటు పెనుగొండ సీమనిచ్చి గుత్తి దుర్గాధిపతిని చేశాడు.<ref>[http://books.google.com/books?id=eAEyAmYRNNQC&pg=PA71&lpg=PA71&dq=murari+rao#v=onepage&q=murari%20rao&f=false Political History of Carnatic Under the Nawabs By N. S. Ramaswami]</ref>
 
==ఫ్రెంచివారితో ఒప్పందం==
"https://te.wikipedia.org/wiki/మురారిరావు_ఘోర్పడే" నుండి వెలికితీశారు