సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sr:Secunderabad
చి r2.7.3) (బాటు: sr:Secunderabad వర్గాన్ని sr:Секундерабадకి మార్చింది; పైపై మార్పులు
పంక్తి 24:
'''సికింద్రాబాద్‌ ''', [[ఆంధ్ర ప్రదేశ్]] [[రాష్ట్రము]] యొక్క రాజధాని అయిన [[హైదరాబాదు]]కు జంట నగరముగా ప్రసిద్ది పొందినది. [[హుస్సేన్ సాగర్]] జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, [[టాంక్ బండ్]] ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వత్యాసం ఉంది.
 
== చరిత్ర ==
[[ఫైలుదస్త్రం:SecbadRlwStn.jpg|thumb|right|200px|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు]]
బ్రిటిష్ వారు మూడవ [[నిజాం]] అయిన [[సికిందర్ జా]] పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు.
సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది.తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్‌లో అంతర్భాగంగా మారింది.1950లో ప్రత్యేకంగా రూపొందించిన చట్టం మేరకు సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌) అనే స్థానిక పురపాలక సంస్థ ఏర్పాటైంది. కార్పొరేషన్‌గానే సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ తన కార్యకలాపాల్ని నిర్వర్తించేది. 28 మంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లుగా వ్యవహరించే వారు. 1960 ఆగస్టు మూడో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో విలీనం చేసింది. అయితే, సికింద్రాబాద్‌ ప్రాంతవాసులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వ ప్రముఖులు సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లలో ఒకరు తప్పనిసరిగా ఎం.సి.హెచ్‌.కు డిప్యూటీగా వ్యవహరించే పద్ధతిని ప్రారంభించారు.అనంతరం హైదరాబాద్‌ ప్రాంతానికి చెందినవారు మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో సికింద్రాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ను డిప్యూటీ మేయర్‌గా, సికింద్రాబాద్‌కు చెందిన ప్రతినిధి మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో హైదరాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యేలా ఏర్పాట్లు చేశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భవించే వరకూ ఎం.సి.హెచ్‌. పరిధిలో కొనసాగిన ఏడు సర్కిళ్లలోసికింద్రాబాద్‌ సర్కిల్‌ ను డివిజన్‌గా పరిగణించారు.
పంక్తి 33:
సికిందరాబాద్ పుట్టి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్బంగా సికిందరాబాద్ పౌరుడు గా ప్రముఖ కవి దాశరధి రంగాచార్య హృదయావిష్కరణ ఇది.
 
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా [[ హుస్సేన్ సాగర్]] అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు [[సికిందర్ ఝూ]] ఉత్తర్వుల తో [[సికిందరబాద్]] గా ఆవిర్బవించింది. జంట నగరాల మద్య ఒక తేడాను గమనించాలు. సికిందరబాద్లో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచాలరలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్థలకు పూర్తి మద్దతు లబించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం. [[నిజాము]] సర్కారుకు వెలుగు అంటే భయం. మార్పులను బలవంతంగా తొక్కి పెడతాడు. అక్కడ సంఘ సంస్కరణల ఉద్యమాలు లేవు. నిజాం నిరంకుశుడు. దేనిమీద నమ్మకం లేదు. నిరంకుశం మీద తప్ప. బ్రిటిష్ వారిది పార్లమెంటరి వ్వవస్త. స్వార్థం వున్న ఉదార వాదులు. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన [[సికింద్రాబాదు]] 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించె వరకు సికింద్రబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో [[ఉర్దూ]] రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రబాద్ వాసులే. [[రాయ ప్రోలు సుబ్బారావు,]] [[కొత్తపల్లి వీరభద్ర రావు,]] [[చువుకుల అప్పయ్య శాస్త్రి]], [[ఆళ్వారు స్వామి]] వంటి మహామహులు అంతా [[సికింద్రాబాదు]] వాసులే. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలె. ఏ హడాఅవుడి లేద్, కాలుష్యం లేదు చక్కని చల్లని గాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు అగ్గి లా రాజు కుంటున్నా సికింద్రాబాలో ప్రశాంతంగా వుండేది.
 
హైదరాబాద్లో తెలుగు అసలే లేదు. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటి వాటి ఊసె లేదు. మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాదానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లొ భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే వున్నది. సికింద్రాబాద్ అభివృద్దికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ హైస్కూల్, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు కూడ మరువలేనివే. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు. ( మూలం: ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:హైదరాబాదు|సికింద్రాబాదు]]
Line 52 ⟶ 53:
[[no:Secunderabad]]
[[ru:Секундерабад]]
[[sr:SecunderabadСекундерабад]]
[[sv:Secunderabad]]
[[sw:Secunderabad]]
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు