దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
<big>నా</big> పేరు మల్లాది కామేశ్వర రావు. పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ కాకినాడ. ఎక్కువ కాలం (సుమారు మూడు దశాబ్దాలు) ఉన్నది విజయవాడ. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ బండ్లగూడ. అమ్మన్నా... అమ్మ భాషన్నా... అభిమానం ఎక్కువ...! అక్షరం నా జీవితం... నా జీవనాధారం...! శుద్ధి చేసేంత జ్ఞానం లేకున్నప్పటికీ అశుద్ధం చేయని సంస్కారం 'అమ్మ' ప్రసాదం...!<br />
 
ముప్పైమూడేళ్ళ జర్నలిస్టు జీవితంలో అన్ని రకాలయిన రచనా ప్రక్రియలలోనూ తలో వేలూ పెట్టేసి, ఓ మూడు నవలలూ, ఓ నాలుగొందల కవితలూ, కాసిన్ని పాటలూ, ఓ అయిదారు వేల వరకూ వ్యాసాలూ రాసి వుంటాను. మెమోరీ ట్రయినర్ గా పిల్లలకు కాస్త మంచి చెప్పడం మరో అభిరుచి. ఆ నేపధ్యంలోనే తెలుగులో మొట్ట మొదటి సారిగా మెమోరీ టెక్నిక్స్ తో ''‘విజయానికి ఎనిమిది సూత్రాలు’'' పుస్తకం విడుదల చేసాను. ప్రస్తుతం జీవిత చరిత్రల రచనలో ఉన్నాను. ఇవి త్వరలోనే విడుదల కానున్నాయి. అబద్ధాల కథలు, నాలో నేను, సక్సెస్ టిప్స్, జస్ట్ థింక్ ఎబౌట్ ... రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సమాచార అన్వేషణలో భాగంగా నెట్ లో గాలిస్తుండగా ఇదిగో ఇక్కడికిలా చేరుకున్నాను.<br />
 
నన్ను ఫోను: 90522 67020 ద్వారా, లేదా మెయిలు malladikr@gmail.com ద్వారా, లేదా చర్చా పేజీ ద్వారా సంప్రదించవచ్చు.<br />
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Malladi_kameswara_rao" నుండి వెలికితీశారు