"సి.కె.నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| mother =
}}
'''కొట్టారి కనకయ్య నాయుడు'''(''Cottari Kanakaiya "CK" Nayudu'') తొలి భారత టెస్ట్ [[క్రికెట్]] జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. 1955లో భారత ప్రభుత్వం నుండి "పద్మభూషణ్" అందుకున్నాడు.
 
నాయుడు [[1895]], [[అక్టోబర్ 31]]న [[నాగపూర్]]లో ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. ఈయన ప్రధమ శ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో, యూరోపియన్ జట్టుకు వ్యతిరేకముగా జరిగినది. ఈయన ఆ ఆటలో తమ జట్టు 79 పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యం తన క్రీడాజీవితపు చివరినాళ్ల వరకు చెక్కుచెదరలేదు.
==కుటుంబ నేపథ్యం==
సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే, ఆయన తాతగారైన నారాయణస్వామినాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి నాగపూరు లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు.
 
సి.కె.నాయుడు సోదరుడు [[సి.ఎస్.నాయుడు]] కూడా ప్రముఖ క్రికెటర్. ఆయన కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్.
 
== సి.కె.నాయుడు క్రికెట్ రికార్డులు==
* 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సి.కె. తన ఆఖరు మ్యాచ్ ఆడింది 1963లో, అరవై ఎనిమిదేళ్ళ వయసులో. క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్న వారు మరొకరు లేరు.
* ఫస్ట్ క్లాసు క్రికెట్లో యాభై ఏళ్ళ వయసు దాటాక కూడా డబుల్ సెంచురీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ళలో సి.కె. ఒకరు.
* భారత జట్టుకి ఆడినవారిలో "విజ్డెన్" పత్రిక "క్రికెటర్ ఆఫ్ ది యియర్" గా ఎంపికైన మొదటి వ్యక్తి(1933)
 
==సి.కె. గురించి కొందరు ప్రముఖుల మాటలు==
* "తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరీర్ నిండిపోయింది" - డాం మొరేస్, రచయిత
* "డగ్లస్ జార్డిన్ జట్టుపై సి.కె.నాయుడు బ్యాటింగ్ జోరు చూశాక విదేశీయులంటే అప్పటివరకూ నాలో గూడు కట్టుకుని ఉన్న భయం కాస్తా పోయింది." - పృథ్వీరాజ్ అన్న అప్పటి యువక్రికెటర్
* "సి.కె.నాయుడుకు భారత క్రికెట్ ఎంతగానో రుణపడి ఉంది. ఆయన భారత క్రికెట్ కు డబ్ల్యు.జి.గ్రేస్ వంటి వాడు" - ఎస్.కె.గురునాథన్, క్రికెట్ రచయిత.
* "
* "ప్రాచ్య దేశాల మార్మికతను రంజీ తర్వాత మళ్ళీ సి.కె.లోను, ముస్తాఖ్ అలీలోను మనం చూడగలం." - ఇ.డబ్ల్యు.స్వాంటన్, ప్రసిద్ధ క్రీడా రచయిత.
* "క్రికెట్ అనూహ్య పరిణామాలకు వేదిక అన్న నానుడికి సి.కె. నుండి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. మరో నాయుడును మనం ఊహించను కూడా ఊహించలేం" - నెవిల్ కార్డస్, ప్రసిద్ధ క్రికెట్ రచయిత.
 
 
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/769007" నుండి వెలికితీశారు