"సి.కె.నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

 
==కుటుంబ నేపథ్యం==
సి.కె.నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందినవారు. అయితే, ఆయన తాతగారైన నారాయణస్వామినాయుడు గారికి రెండు తరాలకి ముందే వాళ్ళ కుటుంబం హైదరాబాదుకి తరలిపోయింది. నారాయణస్వామి తాతగారు నిజాం నవాబు వద్ద దుబాసీగా పనిచేసారు. తరువాత వారి మకాం ఔరంగాబాద్ కు మారింది. చివరికి సి.కె.నాయుడి తండ్రి సూర్యప్రకాశరావు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరు లో స్థిరపడ్డారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె.ప్రతిభను గౌరవిస్తూ, హోల్కర్ సంస్థానాధీశుడు 1923లో ఆయనకి తన సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి, ఇండోర్ రావలసిందిగా ఆహ్వానించాడు. తన ఆఖరు రోజుల వరకూ సి.కె. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. రాష్ట్రానికి ఆవలనున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయన గురించి రాసిన పుస్తకాలలో రాసారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవడం, తెలుగు వస్త్రధారణలో ఉండటం నాయుడి గారి కుటుంబంలో కొనసాగాయి. సి.కె.మరణానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో ఒక వీథికి సి.కె. పేరు పెట్టారు. సి.కె.నాయుడు సోదరుడు [[సి.ఎస్.నాయుడు]] కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్.
 
సి.కె.నాయుడు సోదరుడు [[సి.ఎస్.నాయుడు]] కూడా ప్రముఖ క్రికెటర్. సి.కె. కుమార్తె చంద్ర నాయుడు భారతదేశంలోని తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్.
 
==క్రికెట్ కెరీర్==
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/769018" నుండి వెలికితీశారు