కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''కింజరాపు ఎర్రన్నాయుడు''' (జ.[[23 ఫిబ్రవరి]], [[1957]] -జ.[[2 నవంబర్]], [[2012]] ) 11వ, 12వ, 13వ మరియు 14వ [[లోక్ సభ]]కు [[శ్రీకాకుళం]] స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు [[తెలుగుదేశం పార్టీ]] పొలిట్ బ్యూరొ సభ్యుడు., కేంద్ర మాజీ మంత్రి.[[కోటబొమ్మాళి]] మండలంలోని [[నిమ్మాడ]] ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం [[గార]]లో సాగించి, [[టెక్కలి]]లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ [[విశాఖపట్టణం]]లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు.
 
 
==బాల్యం , విద్యాభ్యాసం==
ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం [[గార]]లో సాగించి, [[టెక్కలి]]లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ [[విశాఖపట్టణం]]లోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో పూర్తిచేశాడు. ఎల్.ఎల్.బి. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యాడు.
==రాజకీయ జీవితం==
[[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను, [[గౌతు లచ్చన్న]], [[ఎన్.జి.రంగా]]ల అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత [[శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా బారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు.
==కుటుంబం==
 
ఇతడి భార్య విజయకుమారి; వీరికి ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు.