జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జంషీద్ కులీ కుతుబ్ షా''' (? - [[1550]]), [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశానికి]] చెందిన రెండవ సుల్తాను. ఈయన [[1543]] నుండి [[1550]] వరకు పాలించాడు. జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని కౄరత్వము చాలా ప్రసిద్ధి చెందినది.
 
==రాజ్య సంక్రమణ==
జంషీద్ తండ్రి, [[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి [[ముస్లిం]] పాలకుడయ్యాడు. సుల్తాన్ కులీకి ఆరుగురు కుమారులు. పెద్దవాడు హైదర్ ఖాన్ సుల్తాన్ కులీ కాలంలోనే మరణించాడు. రెండవ వాడైన కుతుబుద్దీన్ యువరాజుగా నియమించబడ్డాడు. మూడవ కుమారుడైన జంషీద్ కులీ, సోదరుడు కుతుబుద్దీన్ కళ్లు పీకేశాడు. జంషీద్ కుతుబుద్దీన్ ను చంపేందుకు ప్రయత్నించాడని సుల్తాన్ కులీ జంషీద్‌ను బంధింపజేశాడు. తనను బంధించినందుకు ప్రతీకారంగా సుల్తాన్ కులీని చంపేందుకు గోల్కొండ సైనికాధికారి మీర్ మహమ్మద్ హమిదానీని పురమాయించాడు. సుల్తాన్ కులీ కోటలోని జామీ మసీదులో ప్రార్ధన చేస్తుండగా 1543 సెప్టెంబరు 4న హత్యచేయబడ్డాడు. ఈ విధంగా జంషీద్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు కానీ అందరి దృష్టిలో గౌరవహీనుడయ్యాడు.<ref>[http://books.google.com/books?id=i4pvVOd2L0cC&pg=PA30&dq=jamsheed+quli#v=onepage&q=jamsheed%20quli&f=false Land and People of Indian States and Union Territories: In 36 ..., Volume 2 edited by Gopal K. Bhargava, S. C.Bhatt]</ref> జంషీద్ మరో సోదరుడు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], విజయనగరానికి పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు.
 
==బీదరుతో వైషమ్యాలు==
Line 14 ⟶ 15:
[[దస్త్రం:Qutub Shahi Tombs 96.JPG|thumbnail|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరం]]
ఈయన మరణించే ముందు రెండు సంవత్సరాల పాటు కాన్సర్‌కు గురయ్యాడు. క్రమంగా క్షీణించి తన కాన్సర్ బాధను మరిపించేందుకు విలాసాలకు బానిసయ్యాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే కౄరునిగా పేరొందాడు, అందునా కాన్సర్ బాధ దాన్ని మరింత ప్రజ్వలింపజేసి తన పాలనలోని చివరి రోజులు భయంకరంగా తయారయ్యాయి. చిన్నచిన్న నేరాలకు కూడా చాలామందికి పెద్దపెద్ద శిక్షలు వేశాడు. ఏడేళ్ల పాటు పాలించిన జంషీద్ [[1550]]లో మరణించాడు. ఈయన మరణము తర్వాత, ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{క్రమము|