జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==చరమదశ==
[[దస్త్రం:Qutub Shahi Tombs 101.JPG|thumbnail|ఎడమ|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి]]
[[దస్త్రం:Qutub Shahi Tombs 96.JPG|thumbnail|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరం]]
ఈయన మరణించే ముందు రెండు సంవత్సరాల పాటు కాన్సర్‌కు గురయ్యాడు. క్రమంగా క్షీణించి కాన్సర్ బాధను మరిపించేందుకు విలాసాలకు బానిసయ్యాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే కౄరునిగా పేరొందాడు. కాన్సర్ బాధ కౄరత్వాన్ని మరింత ప్రజ్వలింపజేసి తన పాలనలోని చివరి రోజులు అందరికీ వణుకు పుట్టించే విధంగా సాగాయి. చిన్న చిన్న నేరాలకు కూడా చాలామందికి పెద్ద శిక్షలు వేశాడు. ఏడేళ్ల పాటు పాలించిన జంషీద్ [[1550]]లో మరణించాడు. ఈయన మరణం తర్వాత, జంషీద్ కులీ కుతుబ్‌షా యొక్క ఏడేళ్ల కొడుకు సుభాన్ కులీని గద్దెనెక్కించారు. ఆ తదనంతర పరిస్థితులు అనుకూలించడం వళ్ళ, విజయనగరంలో ప్రవాసంలో ఉన్న ఇబ్రహీం కులీ గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
[[దస్త్రం:Qutub Shahi Tombs 101.JPG|thumbnail|ఎడమ|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి]]
 
కుతుబ్‌షాహీ సమాధిమందిరాల్లో ఈయన సమాధిమందిరం విశిష్టమైనది. అష్టభుజాకారంగా రెండు అంతస్థులతో తన తండ్రి సమాధికి ఆగ్నేయదిశలో ఉన్నది. ఒక్కో అంతస్థు చుట్టూ పిట్టగోడలున్నాయి. రెండవ అంతస్థులో ఒక్కో మూలన ఒక చిన్న స్థంబాకార గోపురమున్నది. రెండంతస్థుల పైన ఉన్న పెద్ద గుమ్మటం మాత్రం ఇతర కుతుబ్‌షాహీ సమాధుల శైలిలోనే ఉన్నది. సమాధి మందిరం లోపల మూడు సమాధులున్నవి. అందులోని పెద్ద సమాధి సుల్తానుది.<ref>[http://www.ioc.u-tokyo.ac.jp/~islamarc/WebPage1/htm_eng/golconda-eng.htm#6TOMB%20OF%20JAMSHID%20QULI%20QUTB%20SHAH టోక్యో విశ్వవిద్యాలయ వెబ్ సైటులో జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరపు వర్ణన]</ref><ref>[http://www.ioc.u-tokyo.ac.jp/~islamarc/WebPage1/htm_eng/golconda/Tomb_of_Jamshid_Qutb_Shahi1_e.htm టోక్యో విశ్వవిద్యాలయ వెబ్ సైటులో జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరంలోని చిత్రాలు]</ref>