ఇమ్మడి జగదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సై‌ఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ విజయనగరం రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సై‌ఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి గోల్కొండ రాజ్యపు సరిహద్దులలో [[కోయిలకొండ]]లో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి,<ref name=bilgrami>[http://books.google.com/books?id=wgo97XF0XuYC&pg=PA197&lpg=PA197&dq=naikwaris#v=onepage&q&f=false Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains By Syed Ali Asgar Bilgrami]</ref> జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం పట్టాభిషిక్తుడయ్యాడు.
 
తనకు సహాయం చేసిన జగదేవరావును ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే కొంతకాలానికి జగదేవరావు ఇబ్రహీం కులీని గద్దెదించి యువరాజు దౌలత్ ఖాన్‌ను సుల్తాను చేసే తన పథకాన్ని తిరగదోడాడు. అది ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలియగానే కుట్రలో పాలుపంచుకొన్నవారందరిని హతమార్చాడు. ప్రాణ భయంతో జగదేవరావు ఎలగందలకు పారిపోయి అక్కడ నుండి కుతుబ్‌షాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించాడు. అక్కడ పెద్దగా సహకారం లభించక, బేరారు రాజ్యంలోని ఎలిఛ్‌పూరులో దర్యా ఇమాద్‌షాను ఆశ్రయించాడు.<ref>[http://books.google.com/books?id=aoYgAAAAMAAJ&q=elgandal+jagadeva&dq=elgandal+jagadeva History of the Qut̤b Shāhī dynasty - Haroon Khan Sherwani]</ref> 1556లో [[ఎలగందల్]]పై తిరిగి దాడిచేశాడు కానీ కుతుబ్‌షా సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.<ref name=bilgrami/> జగదేవరావు తన కలలు సాకారం చేసుకోవటానికి బేరారు సరిపోదని గ్రహించి ఒక చిన్న బృందంతో విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గోల్కొండ రాజ్యం గుండా వెళుతూ అనేక గ్రామాలను నేలమట్టం చేశాడు. ఆయన్ను ఎదిరించడానికి కుతుబ్‌షా ముస్తఫాఖాన్ ను పంపించాడు. ముస్తఫా ఖాన్ చేతిలో [[ఖమ్మం|ఖమ్మంమెట్టు]] వద్ద ఓడిపోయి జగదేవరావు విజయనగరంలో ఆశ్రయం పొందాడు.
 
==విజయనగర సేవలో==
"https://te.wikipedia.org/wiki/ఇమ్మడి_జగదేవరావు" నుండి వెలికితీశారు