అనునాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనునాదం దృగ్విషయాన్ని విస్తరించితిని.
పంక్తి 1:
ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని "అనునాదం" అందురు. దీనిని ఆంగ్లంలో (Resonance) అందురు.
{{మొలక}}
==ప్రయోగం-1==
ఒకే [[కంపన పరిమితి]] మరియు ఒకే [[పౌనః పున్యము]] గల రెండు వస్తువుల లో ఒకదానిని కంపింపజేసినపుడు రెండవది కూడా కంపిస్తూ అత్యధిక కంపన పరిమితితో కంపించడాన్ని '''అనునాదం''' అందురు. దీనిని ఆంగ్లంలో (Resonance) అందురు.
రెండు మూతలు లేని ఖాళీ పెట్టెలను తీసుకొని వాటి మూతలు లేని భాగాలు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చునట్లు అమర్చాలి. ఒకే సహజ పౌనఃపున్యం గల రెండు శృతిదండములను తీసికొని రెండు పెట్టెల పైన చెరొకటి అమర్చవలెను. ఒకశృతిదండమును రబ్బరు సుత్తితో కొట్టవలెను.అపుడు ఆ శృతిదండం గల పెట్టెలోని గాలిపొరలు కంపిస్తాయి. ఇలా కంపిస్తున్న గాలి పొరలు రెండవ పెట్టెలోపలి గాలి పొరలను కంపింప జేస్తాయి. అపుడు రెండవ పెట్టె పై గల శృతిదండం ఉత్తేజితమవుతుంది.హికఅపుడు రెండు శృతిదండములు అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని అనునాదం అందురు.
* ప్రయోగించబదిన ఆవర్తనా బల [[పౌనఃపున్యం]] (మొదటి శృతిదండం),వస్తు స్వాభావిక పౌనః పున్యానికి సమానమైతే (రెండవ శృతిదండం) దానిని స్వీకరించి అధిక కంపన పరిమితితో కంపిస్తుంటుంది.
 
==ప్రయోగం-2==
A,B,C,D అనే నాలుగు లోలకముల ను MN ఆధారంతో ఉన్న రబ్బరు గొట్టానికి, నాలుగు స్థానాలలో వ్రేలాడదీయాలి. వాటిలో A,B లోలకముల పొడవులు సమానంగా ఉండునట్లు, C లోలకం పొట్టిగా ఉండునట్లు, D లోలకం పొడవుగా ఉండునట్లు అమర్చాలి. [[లఘులోలకం]] [[పౌనః పున్యం]] దాని [[పొడవు]] పై ఆధారపడుతుంది. కావున A,B లోలకములు ఒకే పౌనఃపున్యము కలిగి ఉంటాయి. వీటిలో లోలకమును డోలనాలు చేయునట్లు చేయాలి. కొంతసేపటికి అనునాద ప్రభావం వల్ల A,B లోకకములు అత్యధిక డోలనాపరిమితితో కంపించటం మన గమనించవచ్చు.
 
==నిత్య జీవిత సంఘటనలు==
# కవాతు చేసే సైనికులను వంతెన పై దాటునపుదు సాధారణ నడకతో దాటమంటారు. దీనికి కారణం కవాతు పౌనఃపున్యం వంతెన సహజ పౌనఃపున్యమునకు సమానమై అనునాదం యేర్పడినపుడు వంతెన కంపనపరిమితి అధికమై వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది.
# [[రేడియో]] లో మనకు కావలసిన స్టేషన్ ఎంచుకొనేటప్పుడు, రేడియో [[ప్రసారిణి]] నుండి విడుదలైన [[విద్యుదయస్కాంత తరంగాలు]] పౌనః పున్యానికి సమానమైన సహజ పౌనఃపున్యాన్ని రేడియోలో సవరిస్తాం. దీనివల్ల ప్రసారిత,రేడియో సహజ పౌనఃపున్యములు సమానమై అనునాదం యెర్పడి మనకు శబ్దాలు వినబడతాయి.
# శంఖం ఊదినపుడు అందులోనికి ప్రవేశించు గాలి పౌనః పున్యము తిరోగామి తరంగం యొక్క పౌనఃపున్యం సమానమైనపుడు [[స్థిర తరంగం]] యెర్పడునపుడు రెండు పౌనఃపున్యములు సమానమైనపుడు అనునాదం యేర్పడి కణాలు అత్యధిక కంపన పరిమితితో కంపించటం వల్ల పెద్ద శబ్దం వినబడుతుంది.
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అనునాదం" నుండి వెలికితీశారు