గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
*'''మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,'''
'''చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.'''
 
పాపం?అతను ఆమెను మనసారా వలచాడు.కాని ప్రియురాలేమో అతని ప్రేమను కఠినంగా తిరస్కరించింది.కాని అతడు సర్వసం వదలి ఆమె ప్రేమకై,అమె అంగీకారానికై జీవితాంతం అమెగురించిన మధురభావనలతో ఎదురుచూస్తూనే వున్నాడు.ఎట్టికేలకు ప్రేయసి మనస్సు కరిగి,అంగీకారంతెల్పుతు లేఖ పంపినది.లేఖ చేతికందినది.కాని చదవకయే కనుమూసినాడు.ఏ ప్రియురాలు ప్రేమకై చకోరపక్షిలా ఎదురుచూసాడో,ఆ ప్రేయసి తన ప్రేమనంగీకరించిందన్న నిజం తెలియకుండనే మరణించాడు.ఎంతటి దురదృష్టవంతుడు?శరత్‍బాబు దేవదాసు గుర్తుకొస్తున్నాదు.
*'''అన్ని బంధాల విదలించినట్టి యెడద '''
'''కురుల ఉరులందునన్ చిక్కుకొనెను,చెలియ!''
 
జీవితంలోని అన్ని బంధాలనుండి విముక్తుడయ్యాడు.అదేమి విచిత్రమో!ప్రియురాలి వలపు గాలంలో చిక్కుకున్నాడు.వురుల(వుచ్చుల)వంటి ప్రియురాలి కురులలో ప్రియుడి మనస్సు చిక్కుకుపోయి,బంధి అయ్యాడట!.కాంతకనకాలకు లొంగనివాడెవ్వడు ఇలలో.
*'''లోకమందు సుఖము శోకమ్ము కలవండ్రు'''
'''శోకమనసె ఇచ్చె నాకు బ్రహ్మ'''
 
జగతిలో మనష్యులకు సుఖదుఃఖాలు సహజం.కొన్నిదినాలు కష్టాలనుభవించినను ,పిమ్మట సుఖలను,భోగాలను పొందటం సహజం,అనివార్యం.పాపం?గాలిబుకు మాత్రం నుదుట అన్ని దుఃఖాలనే, కష్టాలనే రాసాడు ఆబ్రహ్మ.
*'''కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి'''
'''ఇంతి కెవ్వ దనువు లీయకుండు?'''
 
యుద్ధంచేయువారు,రెండు వైపులవారు ఆయుధాలను చేత ధరించి సమరంచేస్తారు,పోరాటం సల్పుతారు.ఇక్కడేమో కదనం రమణీమణితో.చేస్తున్నది ప్రేమ యుద్ధం.పూబోణి చేతిలో ఎటువంటి ఆయుధం చేత పట్టక,తన రమణియ సౌందర్యంతో,వలపుచూపులతో హృదయాన్ని తూట్లు పొడుస్తుంటె,తనువులర్పించనివారుంటారా జగతిలో ?
*'''ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర!'''
'''మంచిచేసిన వానిని ముంచునౌర!'''
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు