"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

4,448 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
* సంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత తో సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ మాత్రమే కరిగిఉంటే ఆ ద్రావణం సంతృప్త ద్రావణం అవుతుంది
* అతి సంతృప్త ద్రావణం: ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే ఎక్కువ అయితే ఆ ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే ఎక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం అవుతుంది.
==ద్రావణీయతను ప్రభావితం చేసే ఆంశాలు==
# ద్రావణి ద్రావిత స్వభావం
# ఉష్ణోగ్రత
* [[ధృవ ద్రావితం]] ధృవ ద్రావణి లో కరుగుతుంది. ఉదాహరణకు నీరు ధృవ ద్రావణి. నీటిలో ధృవ ద్రావితాలైన సోడియం క్లోరైడ్ (తినే ఉప్పు), కాపర్ సల్పేట్, పొటాషియం పర్మాంగనేట్(చినాల రంగు) వంటి వి కరుగుతాయి. కాని అధృవ ద్రావితాలైన కిరోసిన్,నాప్తలీన్, బెంజీన్ వంటి వి కరుగవు.
* [[అధృవ ద్రావితం]] అధృవ ద్రావణి లో కరుగుతుంది. ఉదాహరణకు నాప్తలీన గోళీలు అధృవ పదార్థము. ఇది అధృవ ద్రావితాలైన కిరోసిన్, పెట్రోలు వంటి ధృవ ద్రావణులలో కరుగుతుంది. కాని నీరు వంటి ధృవ ద్రావణిలో కరుగదు.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినపుడు పెరుగు తోంది. ఉదాహరణకు 100 గ్రాముల నీటిలో 68.89 గ్రాముల పంచదార మాత్రమే కరుగుతుంది. ఇంకనూ ఎక్కు వ పంచదార కలిపినట్లైతే హెచ్చుగా కలిపిన పంచదార పాత్ర అడుగున [[అవక్షేపం]] గా మిగిలిపోవును. ఈ హెచ్చుగా గల ద్రావితాన్ని కూడా కరిగించాలి అనుకుంటే ఆ ద్రావణాన్ని వేడిచేయాలి. అపుడు ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం గా మారుతుంది. మరల గది ఉష్ణోగ్రతకు వచ్చినపుడు హెచ్చుగా గల పంచదార పాత్ర గోడలకు అంటుకొని ఉండిపోతుంది.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. ఉదా: ఉప్పు నీటి ద్రావణం తీసుకుంటే 100 గ్రాముల నీరు 37 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుగకోగలదు. దీని ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. స్థిరంగా ఉంటుంది.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినట్లయిన తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినట్లయిన పెరుగుతుంది. ఉదా: సీరస్ సల్ఫేట్.
==వాయువుల ద్రావణీయత==
వాయువులు కూడా వివిధ ద్రావణులలో కరుగుతాయి. ఉదాహరనకు నీటిలో కార్బన్ డై ఆక్సైడ్ కలిపినపుడు సోడా తయారవుతుంది. ఉష్ణోగ్ర త పెంచినపుడు ద్రావణీయత ఫుర్తిగా తగ్గి నీరు యేర్పడుతుంది.
==ద్రావణపు గాఢత==
ప్రమాణ ఘనపరిమానం గల ద్రవణంలో ఉన్న ద్రావిత పరిమాణాన్ని గాఢత అని అంటారు.
===[[భారశాతం]]===
===[[ఘనపరిమాన శాతం]]===
===[[మొలారిటీ]]===
===[[మోల్ భాగం]]===
 
== ఆదర్శ ద్రావణాల లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/774472" నుండి వెలికితీశారు