రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
సుల్తాల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. [[1564]] [[డిసెంబర్ 25]] న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్దమునకు సిద్దమయినారు. [[1565]] [[జనవరి 23]] న జరిగిన తళ్ళికోట యుద్దములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం యుద్ద శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు.
==అరవీడు వంశము==
యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోతాడు. అచటి నుండి రాజ్యమ్ము చక్కదిద్దు ప్రయత్నాలు చేస్తాడు. చాల సంవత్సరములు రాజ్యము చేసి, రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణముగా రామరాయలు, అతని వారసులు చారిత్రలకులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు.ఆరవీటి వంశస్తులు బోయ నాయకరాజులు.ఆ రోజులలో బోయలను పేరు,పదవి అత్యున్నతమైనవి.బోయ అంటే గ్రామాధిపతి ,రక్షకు డు,మహాతల వరుడు ప్రధాన న్యాయాధికారి అని అర్థములు.(ఖండవల్లి లక్ష్మీనిరంజనం,బాలెందు రాజశేఖరం-ఆంద్రుల సంస్కృతి-చరిత్ర).పెనుగొండను పరిపాలించినది బోయలు-నాయకలు,వీరు ధైర్యవంతులు,నిజాయతి పరులు,దేశభక్తి పరాయణులు.(శ్రీ తిరుమల రామచంద్ర-హంపి నుండి హరప్పా దాకా). విజయనగర ప్రాభవము మసకబారింది. మధుర, మైసూరు, కేలాడి నాయకులు స్వతంత్రులయ్యారు. పలుచోట్ల ముస్లిమ్ సేనాధిపతులు చిన్న చిన్న ప్రాంతాలకు అధిపతులై బహమనీలకు, పిదప ముఘలులకు విధేయులుగా వ్యవహరించారు.
 
==యుద్ధానంతర చరిత్ర==
సుల్తానుల మధ్య తిరిగి భగ్గుమన్న విభేదాలు విజయనగరము దాటి వారి ప్రాభవము వ్యాపింపచేయుటకు నిరోధకమైనవి. వెనువెంటనే ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ రాజ్యములను తన సామ్రాజ్యములో కలుపుకొనుటకు చేసిన ప్రయత్నాలవలన సుల్తానుల సమయము, వనరులు, సేనలు ఆత్మసంరక్షణకు వినియోగింపబడ్డాయి. విజయనగర విధ్వంసము గాంచిన సమర్థ రామదాసు తన శిష్యుడు శివాజీని హిందూ ధర్మ రక్షణకై పురిగొల్పుతాడు. ముసునూరి నాయకుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య దీక్షా తత్పరత మరాఠాలకు ప్రేరణ కల్పించాయి. మరాఠాల దాడులతో ముఘల్ సామ్రాజ్యము కూడ బలహీన పడింది. 1707లో ఔరంగజేబు మరణము తరువాత అరాచకము ప్రబలింది. తళ్ళికోట యుద్దము తరువాత 150 సంవత్సరములకు మరాఠాల బావుటా ఢిల్లీ వరకు ఎగిరింది.
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు