సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద,భూజలమీద,సంకళ్లో కండలు,కడవలు పెట్టుకొని మైళ్ళకుమైళ్ళు ఆడ,మగ,పిల్లలు అనేతేడా లేకుండ మిట్టమద్యహన్నం,అపరరాత్రి వేళాపాలా లేకుండ నడచి వెళ్ళ డంవుంది.తాగునీటికై రోజూ కొట్లాటలు,తగాదాలు,బుర్రలు బద్దలుకొట్టుకోవాటాలు,జైలుకెళ్ళడాలున్నాయి.ఇంట్లో మంచినీళ్లయిపోతే చెంబుపట్టుకెళ్ళి ఇంటీంటికి తిరిగి అడుక్కొవడంవుంది.పొలంలో నాట్లు వేసి, మబ్బులేలేని ఆకాసం వైపుఆశగా వానచినుకుకై చూసే గాజుకళ్ళబక్కరైతుల బతుకులున్నాయి.కరువొస్తే,తమకుటుంబంలో ఒకరిగాచూసుకొనే గొడ్లకు పిడెకెడు మేతలేక,కొనేసత్తువలేక,మనసు రాయి చేసు కొని కసాయివాళ్లకు అమ్మే పల్లెజీవుల బతుకులున్నాయి.బావుల్లో నీళ్ళుచాలక,కరెంటురాక పంపులు పనిచేయ్యక,లోఒల్టెజి కారణంగా మోటార్లుకాలిపోయి, పైర్లు ఎండిపోతుంటే చూడలేక ప్రాణాలు గిజగిజ లాడుతుంటే,పుట్తినప్పటినించి తామునమ్ముకున్న నేలతల్లిఒడిలోనే కనులుమూసిన ఛిద్రమైన రైతు వ్యధలున్నాయి.
 
రెక్కలుముక్కలుచేసుకొని,కుటుంబంలోనివారంత తమ స్వంతపొలంలోనె కూలిలమారి పంటపండిస్తె,వడ్దివ్యాపారులు,ఎరువులు,నాసిరకంవిత్తనాలు,నకులీపురుగుల మందులు అప్పుగాయిచ్చిన ఆంగడివాళ్ళు, పంటకొనటానికి వచ్చిన దళారులు,కొనుగోలుదారులు రాబందులవలె చుట్టూచేరి,రైతు కష్టఫలాన్నిదోచుకొని రైతును నడిబజారులో బిచ్చగాడిలా నిలబెట్టిన నిజాలున్నాయి.నగరంలో విలాసవంతమైన జీవితా నికై హైటెక్కు వ్యభిచారం చేస్తుంటే,ఒకపూటనైన పస్తులున్న పిల్లలకడుపునింపెటందుకు "ఆతప్పు"చేస్తె తప్పెముందనుకునే కూలిపనిచేసె చెంగమ్మ లాంటి ఆడబ్రతుకులున్నాయి.
 
అందినకాడికి అప్పుచేసి,తాళిబొట్టుతో సహ అయినకాడికి అన్నిఅమ్మి,బావి త్రవ్విస్తే,అందులో బండపడి,తమబతుకులు బండలై,ఆబావిలోనే శవాలైన చితికిన రైతుబతుకులున్నాయి.పూలమ్మినచోట కట్టెలమ్మలేక పక్కజిల్లాలకు,కూలీలగా,ప్యాక్టరిలలో కార్మికులుగా వెళ్లిన వుదాంతాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు