మైక్రోమీటర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox laboratory equipment
[[Image:Mahr Micromar 40A 0-25mm Micrometer.jpg|250px|right|thumb|నవీన మైక్రోమీటర్]]
|name = మైక్రోమీటర్
|image =Mahr Micromar 40A 0-25mm Micrometer.jpg
|alt =
|caption = స్క్రూగేజ్
|acronym =
|other_names = స్క్రూగేజ్
|uses = 0.01మి.మీ వరకు ఖచ్చితంగా కొలుచుటకు
|inventor = మొదట ప్రవేశపెట్టినవారు -William Gascoigne
|manufacturer =
|model =
|related =
}}
[[Image:Micrometers.jpg|250px|right|thumb|బాహ్య,అంతర,లోతులను కనుగు పరికరం]]
ఒక వస్తువు పొడవును 0.001 మి.మీ వరకు ఖచ్చితంగా కొలిచే పరికరము మైక్రోమీటరు.ఇది స్వల్ప వ్యాసాలు, స్వల్ప మందాలు అతి ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని స్క్రూగేజ్ అనికూడా అంటారు. ఒక వస్తువు పొడవును కొలవాలంటే సాధారణంగా స్కేలును ఉపయోగిస్తాము. స్కేలు యొక్క కనీసపుకొలత 1 మి.మీ. ఒక మి.మీ కంటె తక్కువ పొడవులను కొలుచుటకు వాడే పరికరం [[వెర్నియర్ కాలిపర్స్]]. ఇది ఒక మిల్లి మీటర్ లో పదవ వంతు వరకు ఖచ్చితంగా కొలవగలదు. ఒక మిల్లీ మీటరులో 100 వ వంతు వరకు ఖచ్చితంగా కొలిచె సాధనం స్క్రూగేజ్ లేదా మైక్రోమీటర్. దీనిని తెలుగులో సూక్ష్మ మాపకం అంటారు.
ఒక వస్తువు పరిమాణాన్ని ఖచ్చితంగా కొలవడానికి కొలత టేపును లేక స్కేలును ఉపయోగిస్తారు, మరీ చిన్న వస్తువుల పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాలను మైక్రోమీటర్ అంటారు, దీనిని మైక్రోమీటర్ స్క్రూగేజ్ అని కూడా అంటారు. దీనిని సన్నని తీగల, దారాల యొక్క ఖచ్చితమైన మందాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మైక్రోమీటర్ అను పదం ఆంగ్ల పదం, దీనిని తెలుగులో సూక్ష్మ మాపకం అంటారు.
==పనిచేసే సూత్రము==
ఇది మర సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
==యిందులో గల స్కేళ్ళు==
* తల స్కేలు
* పిచ్ స్కేలు
 
==మరభ్రమణాంతరం==
మరశీల ఒక పూర్తి భ్రమణం చేసినపుడు మర కదిలిన దూరమును మరభ్రమణాంతరం లేదా మరపిచ్ అందురు.తలస్కేలు ఒక పూర్తి భ్రమణం చేయునపుదు అది పిచ్ స్కేలుపై కదిలిన దూరం మరభ్రమణాంతరం అవుతుంది. ఉదాహరణకు తలస్కేలు 10 భ్రమణాలు చేసినపుడు మరశీల పిచ్ స్కేలుపై కదిలిన దూరం 10 మి.మీ అయిన మరభ్రమణాంతరం 1 మి.మీ. అవుతుంది.<br />
మరభ్రమణాంతరం = మరకదిలిన దూరం / మర చేసే భ్రమణాల సంఖ్య
==కనీసపు కొలత==
ఒక పరికరంతో కొలవగలిగే అతి తక్కువ కొలతను కనీసపు కొలత అందురు. స్క్రూగేజ్ లో తలస్కేలుపై 100 విభాగాలుంటాయి. తలస్కేలు ఒక భ్రమణం చేయునపుడు మర కదిలిన దూరం 1 మి.మీ అయిన ఒక తలస్కేలు విభాగం కదిలినపుడు మర కదిలిన దూరం 0.01 మి.మీ అవుతుంది. అందువలన స్క్రూగేజ్ కనీసపు కొలత 0.01 మి.మీ. లేదా 0.001 సెం.మీ అవుతుంది.<br />
కనీసపు కొలత = మరభ్రమణాంతరం / తలస్కేలు విభాగాల సంఖ్య
 
== వర్ణన==
స్క్రూగేజ్ "U" ఆకారంపు లోహ చట్రం కలిగి ఉంటుంది. ఈ చట్రం ఒక చివర ఒక పొట్టి దండం బిగించి ఉంటుంది. దీనికి ఎదురు దిశలో బోలుగా, పొడవుగా వున్న ఒక లోహపు స్థూపాకార గొట్టం బిగించబడిఉంటుంది. ఈ ఖాళీ స్థూపం లోపలి భాగంలో సర్పిలాకారపు గాళ్ళు చెక్కబడి ఉంటాయి. అందువలన అది ఒక నట్తు మాదిరిగా పనిచేస్తుంది. దాని బాహ్య తలం మీద పొదవుగా అక్షం వెంబడి ఒక సూచీ రేఖ సమభాగాలుగా చేయబడి ఉంటుంది. ఇది "పిచ్ స్కేలు". పొట్టి దండం ఎదురుగా మరొక దండం ఉంటుంది. ఇది లోహపు స్థూపం లోపల ఉన్న సర్పిలాకారపు గాళ్ళు మాదిరిగానే ఉన్న గాళ్ళు రెండవ దండం మీద చెక్క బడి ఉంటాయి. దీనికి మరొక చివర గాడులు చేయబడిన ఒక మరశీల తల ఉంటుంది. తలస్కేలు స్థూపం పై 100 విభాగాలుంటాయి.
==పొడవు కనుగొనే విధానం==
 
==శూన్యాంశ దోషములు==
 
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/మైక్రోమీటర్" నుండి వెలికితీశారు