నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం గురుంచి సోమవారం అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చ జరిపింది. ఉదయం తొమ్మిది గంటలకు మొదలయిన సభ అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చ జరుగుతూనే ఉంది. రాత్రి ఒంటిగంటకు మొదలయిన ఓటింగ్ ప్రక్రియలో ఊహించని పరిణామాలేవీ జరగలేదు. అవిశ్వాసానికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. వీరిలో తెలుగుదేశం(85), తెరాస(11), సి.పి.ఐ(4), సి.పి.ఎం(1), బి.జే.పి(2), వై.ఎస్.ఆర్. కాంగ్రెస్(1 + 18 ) అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా 160ఓట్లు వచ్చాయి. జగన్ అనుకూలురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక పి.ఆర్.పి ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేను కలుపుకొని వై.ఎస్. జగన్ బలం 19అని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. జగన్ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను పదికి పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం, కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అసెంబ్లీ లాబీలోనే బెదిరింపులు, హెచ్చరికలతో కూడిన బుజ్జగింపులు చేసినప్పటికీ జగన్ కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు పట్టు విడవలేదు. ఒకానొక సమయంలో మంత్రి వట్టి వసంత కుమార్ తమ ఎమ్మెల్యేలను ఎందుకు రూములోకి తీసుకెళ్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని ఆయనతో వాదులాటకు దిగారు. కేవీపీ, ఎంపీ ఉండవల్లి కూడా అసెంబ్లీ పరిసరాల్లోనే జగన్ వర్గం ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఎన్ని ప్రలోభాలు చూపినా, అనర్హత వేటుకు, ఉప ఎన్నికలకు సిద్దమవుతూ జగన్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తెదాపా ప్రవేశ పెట్టిన ఈ అవిశ్వాస తీర్మానంతో చివరకి తిప్పలు వచ్చి పడ్డది జగన్ కే. తన దయాదాక్షిణ్యాలతో ప్రభుత్వం నడుస్తుందన్న మాటలు ఉత్తవేనని తేటతెల్లమైంది. జగన్ కున్న బలమెంతో తేలిపోయింది కాబట్టి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తొలగింది అనే అనుకోవాలి. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాత్రం ఎటూ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. జగన్ వర్గం ఎమ్మెల్యేగా ప్రచారంలో ఉన్న పూతలపట్టు రవి ఆఖరి నిమషంలో అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి గైర్హాజరయ్యారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్ ) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సోమారపు సత్యన్నారాయణ ( టి.ఆర్.ఎస్ తో కలిసి ఉంటున్నారు ) అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు.
 
== గుర్తింపులు ==
- స్వాగతం పలికిన సవాళ్ళు
 
- కిరణ్ కుమార్ రెడ్డి పాలనతో సుస్థిరత సాధన
 
- సందిగ్ధతను సృష్టించిన కుల సమీకరణాలు
 
- సకల జనులసమ్మెకు సంయమనంతో పరిష్కారం
 
- పాలనపై, పార్టీపై పెరిగిన పట్టు
 
- ఉద్యమాలకు సంక్షేమాస్త్రంతోనే సమాధానం
 
- ‘రచ్చబండ’ ఆయుధంగా ప్రజాభిమాన సాధన
 
- చరిత్ర సృష్టించిన కిలోబియ్యం రూపాయి పథకం
ith
 
== బయటి లింకులు ==