"అరిస్టాటిల్" కూర్పుల మధ్య తేడాలు

== విజ్ఞానార్జన, విద్యాబోధన ==
అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో [[ప్లేటో అకాడమీ]] లో చేరి [[ప్లేటో]] కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు.తత్వ శాస్త్రం,రాజనీతి శాస్త్రము,గణిత శాస్త్రము,ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ కూకంకషంగా అధ్యయనం చేసాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహద పడాతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ.పూ 347 లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగినది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హిర్మియన్ సోదరిని పెళ్ళి చేసుకున్నాడు.మారిడోనియా రాజైన ఫిలిప్ - హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన [[అలెగ్జాండర్]] కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన [[మాసిడోనియా]]కు చేరాడు.గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ [[ఏథెన్స్]] చేరుకుని [[ప్లేటో అకాడమీ]] కి పోటీగా [[లైజియం]] అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.
 
==పరిశోధనలు==
అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని "జీవ శాస్త్ర పిత" గా బహళ ప్రాచుర్యం పొందాడు. వివిధ జీవ జాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ద చూపి - దేహనిర్మాణం, సంతానోత్పత్తి విధానాలు, రక్త గుణాలు, జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేశాదు. 18 వ శతాబ్దం లో [[లిన్నెయస్]] వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణన నే ప్రామాణికంగా తీసుకునేవారు.
: భూమి ఆవిర్భావం,పర్వతాలు రూపొందే విధానం గురుంచి కూదా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు.
==రచనలు==
ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంధం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్,యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ట తెచ్చి పెట్టింది.
==పరిశోధనలలో లోపాలు==
* బరువైన వస్తువు తేలికైన వస్తువు కంటే త్వరగా భూమిని చేరుతుందని చెప్పాడు. ఇది తప్పని [[గెలీలియో]] ఋజువు చేశాడు.
* శూన్య ప్రదేశం సృష్టించడం అసాధ్యమన్నాడు. కాని సాధ్యమేనని తదుపరి తెలిసింది.
* వస్తువు కదలాలంటె శక్తి అవసరమని మామూలుగా వస్తువు స్థిరంగా ఉంటుందని చెప్పాడు. కాని న్యూటన్ తప్పని ఋజువు చేశాడు.
* విశ్వానికి భూమి కేంద్రమని, చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నదని చెప్పాడు. కాని ఈ రెండు తప్పే కదా!
 
== ఆరిస్టాటిల్ భావవాదం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/781928" నుండి వెలికితీశారు