అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును.ఆకులు20-40మి.మీ.పొడవుండి,3మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండురకాలున్నాయి.చిన్నగింజల రకం,పెద్దగింజల రకం.చిన్నగింజలు బ్రౌనురంగులో,పెద్దవి పసుపురంగులో వుండును.పూలు లేతనీలంరంగులో వుండును.విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును.నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకంగింజలలో 33.0% వరకు పెద్దగింజలలో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చెక్కరలు,5-10%వరకు పీచుపదార్థం(Fiber)వుండును.మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజలఆకారంలో వుండి,పైపొట్టు మెరుపుగా వుండును.పొడవు 4-6మి.మీ.పొడవుండును.చిన్నరకంగింజలైనచో గ్రాముకు 170 వరకు,పెద్దగింజలైనచో 130 వరకు తూగును.
==నూనె==
అవిసె నూనెగింజలను మొదట నూనెతీయుయంత్రాలలోఆడించి నూనెను తీసి,కేకులోవున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ప్లాంటుద్వారా తీయుదురు.నూనెతీయుయంత్రాలలో నూనెను రెండు పద్ధతులలోతీయుదురు.ఒకటి కోల్డుప్రాసెస్.ఈపద్ధతిలో నూనెగింజలను వేడిచెయ్యకుండ నేరుగా ఎక్సుపెల్లరులను నూనెతీయుయంత్రాలలో క్రష్‍చేయుదురు.ఈపద్ధతిలో వచ్చిననూనె పసుపురంగులో వుండును.కాని కేకులో ఎక్కువశాతం నూనెమిగిలిపోవును. హాట్‍ప్రాసెసు పద్ధతిలో గింజలను స్టీముద్వారామొదట వేడిచేసి ఆపిమ్మట క్రష్‍ చేయుదురు.ఈ పద్ధతిలో సేకరించిన నూనెకొద్దిగా ముదురు పసుపురంగులో వుండును.కాని గింజలనుండివచ్చుదిగుబడి ఎక్కువవుండును.
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు