వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==జామ చెట్టు==
జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు.
జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.
జామకాయలో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .
అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు.
[[జామ|http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AE]]
 
==రేగు చెట్టు==
రేగు చెట్టు లాటిన్ పేరు జిజిఫస్ జుజూబా. చిన్న పొదలు గానూ పెద్ద వృక్షం గానూ ఉంటుంది. మెట్ట ప్రాంతం లోనూ బంజరు భూములలోనూ పెరుగుతుంది. ఇది నిత్య హరిత వృక్షము దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు బారి మందంగా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదలు లో ముళ్ళు కలిగి ఉంటుంది, ఆకులు గుండ్రంగా క్రిందవైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు