పైథాగరస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
గణిత వేత్త,తత్వవేత్త అయిన పైథోగొరస్ క్రీస్తు పూర్వం 580-500 మధ్య కాలానికి చెందిన వాడు. [[గ్రీసు]] లోని సామౌస్ అనే చోట జన్మించాడు. ఈ సామౌస్ ద్వీపం అప్పట్లో పద్ద వర్తక కేంద్రంగా, విధ్యా కేంద్రంగా ఉండేది. పైధోగరస్ ధనవంతుల బిడ్డ కాబట్టి బాగానె చదువుకున్నాడు. చిన్నప్పటినుండి ఈయన అసమాన ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించాడు. ఈయన ప్రశ్నలకు అధ్యాపకులే సమాధానాలు చెప్పలేక తలమునకలయ్యేవారు. ఈయనకు చదువు నిమిత్తం థేల్స్ ఆఫ్ మిలెటస్ సు పంపడం జరిగింది. అప్పుడే పైధోగొరస్ విశ్వవిఖ్యాతమైన తన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఒకరకంగా చెప్పాలంటె జ్యామితీయ గణితానికి బీజాలు వేసినవారిలో ఈయన కూడా ఒకరు.
==సిద్ధాంతాలు==
ఒక [[త్రిభుజం]] లోని కోణాల మొత్తం అంటే 180 డిగ్రీలు లేదా రెండు లంబకోణాలని ఆయన చెప్పారు. [[పాస్కల్|బ్లెయిస్ పాస్కల్]] కూడా అదే విషయాన్ని ఋజువు చేసారు. అదే విధంగా ఒక లంబ కోణ త్రిభుజంలో కర్ణం మీదివర్గం మిగిలిని భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం అనేది పైథోగొరస్ సిద్ధాంతం. ఒక త్రిభుజంలో భుజాల కొలతలు 3,4 అయి కర్ణం 5 అయితే 3<sup>2</sup>+4<sup>2</sup>=5<sup>2</sup>అవుతుంది.
==పరిశీలనలు==
ఆ కాలంలో పుస్తకాలు లేవు చర్చల ద్వారానే విషయాల పట్ల అవగాహన యేర్పరచుకొనేవారు. ఈయన [[పెర్షియా]],[[బాబిలోనియా]],[[అరేబియా]] మరియు [[భారతదేశం]] లో కొంతభాగం వరకు వెళ్లాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. [[ఈజిప్ట్]] లో ఎక్కువ కాలం ఉండి [[సంగీతం]] నేర్చుకున్నాడు. [[సంగీతం|సంగీతానికి]] మరియు [[అంకగణితము]] నకు మధ్య గల సంబంధముల గూర్చి పరిశీలనలు చేశాడు.
==గురువుగా==
దక్షిణ ఇటలీ లోని క్రోటోనే లో క్రీ.పూ 529 లో ఒక పాఠశాల ప్రారంభించాడు. 300 మంది శిష్య గణం ఉన్న ఈ పాఠసాలలో అంకగణితం , జ్యామితి,సంగీతం,ఖగోళ శాస్త్రాల గూర్చి బోధించేవారు. గ్రీకు తత్వ శాస్త్రం కూడా చెప్ఫేవారు. పైధోగరస్ అతి సామాన్యంగా జీవించారు. సంఖ్యా శాస్త్రం పట్ల ఈయనకు చక్కటి అవగాహన ఉండేది. పిరమిడ్లను క్యూబ్ లను చిత్రించేవాడు.రాత్రింబవళ్ళు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణాల చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఏర్పడుతున్నాయని ఈయన ఊహించాడు. ఏ సాధనాలు లేనప్పుడు ఇన్ని విషయాలు చెప్పే పైధాగరస్ అభినందనీయుడు.
==ముగింపు==
అనవసర రాజకీయాలు ముదిరి పైధాగరస్ ను ప్రక్కకు నెట్టడం జరిగినది. ఆయన అజ్ఞాత వాసంలోకి వెళ్ళక తప్పలెదు. ఆ దిగులు తోనే ఎనభై యేళ్ళ వరకు బ్రతికి ఆ తరువాత ఇటలీ లోని మెటో పోంటం లో క్రీ.పూ 500 లో కన్నుమూసాడు. ఈయన మరణించిన 200 సంవత్సరాల తర్వాత గ్రీకులు ఈయన గొప్ప తనాన్ని గ్రహించి రోం లో ఒక విగ్రహాన్ని యెర్పాటు చేశారు. "అతి తెలివైన సాహసి" గా కితాబిచ్చారు.
 
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:గణిత శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు]]
 
[[en:Pythagoras]]
[[hi:पाइथागोरस]]
"https://te.wikipedia.org/wiki/పైథాగరస్" నుండి వెలికితీశారు